Add Zee Business As A Preferred Source
App

Gold Rate: పర్సనల్ లోన్ తీసుకుని బంగారం కొనొచ్చా? అలా కొంటే.. లాభమా నష్టమా? తెలుసుకోవాల్సిన విషయాలివే..!!

Written ByBhoomi
Published: Sep 14, 2025, 03:01 PM IST|Updated: Sep 14, 2025, 03:01 PM IST

Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుని బంగారం కొనడం ఆర్థికంగా రిస్క్ ఉన్న నిర్ణయమని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. అధిక వడ్డీ భారంతో పాటు బంగారం ధరల్లో మార్పులు నష్టాలకు దారితీస్తాయంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ మార్గం మంచిదని చెబుతున్నారు. పెట్టుబడికి గోల్డ్ ETFలు, SIPలు మెరుగైన ప్రత్యామ్నాయాలుగా సూచిస్తున్నారు.

Personal Loan1/6

బంగారం ధరలు

బంగారం అంటే భారతీయులకు ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పెట్టుబడుల కోసం బంగారం కొనడం సహజం. కానీ ఈ మధ్య బంగారం ధరలు భారీగా పెరుగుతుండటంతో చాలా మంది బంగారం కొనాలంటేనే భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో కొందరు పర్సనల్ లోన్ తీసుకుని బంగారు ఆభరణాలు కొనాలా అని ఆలోచిస్తున్నారు. కానీ ఇది నిజంగా మంచిదా? లేక రిస్క్ ఎక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చెబుతున్నారు? తెలుసుకుందాం.

Gold Rate2/6

పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి?

 

పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి?

బ్యాంకులు సాధారణంగా పర్సనల్ లోన్ పైన 15శాతం నుంచి 18శాతం వరకు వడ్డీ వసూలు చేస్తాయి. అంటే మీరు బంగారం కొనడానికి పర్సనల్ లోన్ తీసుకుంటే, ఆ వడ్డీ మొత్తాన్ని కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ధరలు తగ్గితే మీరు పెట్టుబడిలో లాభం కాకుండా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది.

 

Gold Investment3/6

పెట్టుబడికి సరైన మార్గమా?

 

పెట్టుబడికి సరైన మార్గమా?

బులియన్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, పర్సనల్ లోన్ తీసుకుని బంగారం కొనడం తెలివైన నిర్ణయం కాదని చెబుతున్నారు. ఎందుకంటే బంగారం పెట్టుబడి అనేది స్థిరమైన రాబడి ఇవ్వదు. వడ్డీ చెల్లింపులు ఒకవైపు, బంగారం ధరల్లో మార్పులు మరోవైపు ఉంటాయి. దీంతో పెట్టుబడి కంటే రిస్క్ ఎక్కువే అవుతుందంటున్నారు.

 

Gold ETF4/6

ఎప్పుడు పర్సనల్ లోన్‌తో బంగారం కొనొచ్చు?

 

ఎప్పుడు పర్సనల్ లోన్‌తో బంగారం కొనొచ్చు?

అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ఉదాహరణకు పెళ్లిళ్లు లేదా అత్యవసర శుభకార్యాల సమయంలో, గత్యంతరం లేకపోతే పర్సనల్ లోన్ తీసుకుని బంగారం కొనడం తప్పదు. ఆ సందర్భంలోనూ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని, తక్కువ వాయిదాలతో తిరిగి చెల్లించేలా చూడాలని చెబుతున్నారు.

 

Gold Price Today5/6

పెట్టుబడికి మంచిన ప్రత్యామ్నాయం

 

పెట్టుబడికి మంచిన ప్రత్యామ్నాయం

మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే రుణం తీసుకోవడం కన్నా గోల్డ్ ETFలు లేదా గోల్డ్ SIPలు ఉత్తమమైన మార్గాలు. ఇవి చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఇస్తాయి. అదనంగా, రుణం వడ్డీ భారమూ ఉండదు. దీని ద్వారా మీరు దీర్ఘకాలంలో మంచి లాభం పొందే అవకాశముంది.

 

 Personal Loan6/6

పర్సనల్ లోన్

 

మొత్తానికి, పర్సనల్ లోన్ తీసుకుని బంగారం కొనడం ఆర్థికంగా రిస్క్ ఉన్న నిర్ణయం. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ ఆప్షన్‌ ను పరిశీలించాలి. పెట్టుబడి కోసం అయితే గోల్డ్ ETFలు, SIPలు లాంటి మార్గాలు చాలా బెటర్ అని చెబుతున్నారు నిపుణులు.