Add Zee Business As A Preferred Source
App

Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం..గ్రాము బంగారం ధర కేవలం.. 6,350 మాత్రమే.. ఇప్పుడే కొనేయండి!

Written ByVishnupriya
Published: Oct 01, 2025, 07:36 AM IST|Updated: Oct 21, 2025, 10:50 AM IST

Gold Rate: బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ సడన్గా.. బంగారం తగ్గుముఖం పట్టడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ  ఎంత తాగింది, అసలు ఈ రేట్ ఎక్కడ తీసుకుంటే వర్తిస్తుంది ‌… పూర్తి వివరాల్లోకి వెళితే
 

Gold Cost1/5

24 క్యారెట్ల బంగారం,

సాధారణంగా ఈ మధ్యకాలంలో బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర ఎన్నడూ లేని విధంగా 1,05,000 కు చేరుకొని సామాన్యుడినే కాదు ధనవంతుడిని కూడా ఆశ్చర్యపరిచింది. 

Gold Rate Reduced 2/5

22 క్యారెట్ల బంగారం,

24 క్యారెట్ల పెట్టుబడి బంగారం అయితే ఏకంగా 1,10,000 దాటిన విషయం తెలిసిందే. నిజానికి చాలామంది వ్యక్తులు సేఫ్ పెట్టుబడిపై మొగ్గు చూపుతున్న నేపథ్యంలోనే ఇక్కడ బంగారం ధరలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో శుభకార్యాలు ఎక్కువగా నడుస్తున్నా.. బంగారం ధరలు ఎక్కువగా ఉండడంతో వాటిని కొనుగోలు చేయడానికి ప్రజలు కూడా పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు. 

Gold Rate Decreased 3/5

ఇండియా బంగారం రేటు,

అయితే ఇలాంటి సమయంలో ఒక దగ్గర మాత్రం.. బంగారం ధరలు భారీగా తగ్గిపోయాయని తెలిసి అందరూ సంతోషంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. బంగారం ధరలు తగ్గుదల మన ఇండియాలో కాదు వియత్నాంలో. అక్కడితో పోల్చుకుంటే మన భారతదేశంలో భారీగా ధరలు ఉన్నాయని చెప్పవచ్చు.   

Gold Rate Update4/5

వియత్నాం బంగారం ధర,

 వియత్నాంలో ఒక గ్రాము బంగారం ధర 6,350 మాత్రమే. తులం 75,000.. ఇక మన ఇండియాలో చూసుకుంటే గ్రామ పదివేలు చూపిస్తోంది.  మన ఇండియాకి, వియత్నాంకి మధ్య ఒక గ్రాము కి సుమారుగా 3,500 డిఫరెన్స్ ఉండడం గమనార్హం. 

How To Buy Gold For Less5/5

బంగారం తగ్గుదల,

ఏది ఏమైనా ఇంత తేడా చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇది తెలిసిన చాలా మంది అక్కడ ఉండే తెలుగు వారితో.. బంగారం కొనుగోలు చేయాలని ఆసక్తి కనబరుస్తూ ఉండడం గమనార్హం. మరి కొంతమంది అక్కడికి టూర్ కూడా ప్లాన్ చేస్తున్నారు.