Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర... చైనా తో చర్చలు మొదలుపెట్టిన ట్రంప్... ఈరోజు పసిడి ధరలు ఇవే..

Gold Rate Today: బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. మే 11వ తేదీ ఆదివారం కూడా బంగారం ధర తగ్గింది. ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,680 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,450 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 1,11,000 పలుకుతోంది. 
 

1 /6

బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అమెరికా చైనా మధ్య కొనసాగుతున్నటువంటి వాణిజ్య చర్చలే కారణం అని చెప్పవచ్చు. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న ట్రేడ్ వార్ ఒక ఒప్పందంతో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే కనుక జరిగినట్లయితే బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. 

2 /6

ముఖ్యంగా అమెరికా చైనా మధ్య కొనసాగే ఈ చర్చల్లో ప్రధానంగా సుంకాల విషయంలో ఇరు పక్షాలు రాజీ పడే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగినట్లయితే, బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. 

3 /6

ఎందుకంటే స్టాక్ మార్కెట్లలో ఈ సానుకూలమైన వార్త ద్వారా భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు డాలర్ విలువ కూడా బలంగా పెరుగుతుంది. ఫలితంగా బంగారంలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్లతో పాటు అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్ల వైపు తరలించే అవకాశం ఉంటుంది. ఫలితంగా బంగారం ధరలు భారీగా తగ్గుతాయి.   

4 /6

మార్కెట్లో ఎప్పుడైతే బంగారానికి డిమాండ్ తగ్గుతుందో అప్పుడు బంగారం ధర తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ఇలా ఉంటే గడచిన కొంతకాలంగా బంగారం ధరలు ఆల్ టైం రికార్డులను దాటి ముందుకు దూసుకెళ్లాయి. అక్కడి నుంచి నెమ్మదిగా తగ్గడం ప్రారంభిస్తున్నాయి. బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.  

5 /6

 ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి పెరిగిన ధరల వల్ల ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా వారు అనుకున్న బడ్జెట్ కన్నా కూడా బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అందుకే బంగారం కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

6 /6

 ముఖ్యంగా బంగారం క్వాలిటీ విషయంలోనూ ప్యూరిటీ విషయంలోనూ ఎలాంటి రాజీ పడొద్దు అని నిపుణులు సూచిస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగానే బంగారాన్ని కొనుగోలు చేయాలని లేకపోతే మోసపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.