Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. రోజు రోజుకు రికార్డులను దాటేస్తున్నాయి. బంగారం ధరించడం కంటే బంగారంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను ఇస్తోంది బంగారం. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 12వ తేదీ శుక్రవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
1/7Gold Rate Today: ప్రస్తుతం చాలా మంది బంగారు నగలు కొనుగోలు చేయడం కంటే బంగారంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే బంగారం ధరలు రోజు రోజుకు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాయి. ధరలు ఇప్పటికే రికార్డు స్థాయికి చేరుకోవడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రపంచ ఆర్థిక పరిణామం జరిగినా బంగారం మార్కెట్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకోవడం సహజం.
2/7శుక్రవారం ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరొక కొత్త గరిష్ఠాన్ని తాకాయి. సెప్టెంబర్ 12వ తేదీ శుక్రవారం నాడు 10 గ్రాముల పసిడి ధర రూ. 100 పెరిగి రూ. 1,13,100కి చేరుకుంది. అదేవిధంగా 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా రూ.100 పెరిగి రూ. 1,12,600కు చేరింది. ఈ సమాచారాన్ని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. అంటే ఈ ఏడాదిలోనే పసిడి ధరలు 43శాతం కంటే ఎక్కువగా పెరిగి పెట్టుబడిదారులకు విభిన్న సంకేతాలు ఇస్తున్నాయి.
3/72025 ప్రారంభంలో అంటే డిసెంబర్ 31, 2024 నాటికి, బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 78,950గా ఉండగా ఇప్పటి వరకు రూ. 34,150 పెరిగి రూ. 1.13 లక్షల మార్క్‌ను దాటాయి. మార్కెట్ నిపుణుల ప్రకారం ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు ద్రవ్యోల్బణ భయాలు, ప్రభుత్వ రుణాల పెరుగుదల, అమెరికా ఆర్థిక వృద్ధి మందగమనం అని చెప్పవచ్చు. వీటికి తోడు ఆసియా మార్కెట్లలో ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) లో భారీ పెట్టుబడులు రావడం కూడా కీలక పాత్ర పోషించింది.
4/7ఆగ్‌మాంట్ రీసెర్చ్ హెడ్ రెనిషా చైనాని మాట్లాడుతూ, "ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు పెరుగుతున్నాయి. అలాంటి సమయంలో సురక్షిత పెట్టుబడిగా పసిడి మీద డిమాండ్ పెరుగుతోంది" అని చెప్పారు. మరోవైపు PL క్యాపిటల్ CEO సందీప్ రైచురా మాట్లాడుతూ, "ఈ సంవత్సరం బంగారం ధరల ర్యాలీకి ప్రధాన కారణాలు కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, ETFలపై దృష్టి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు" అని పేర్కొన్నారు. అయితే ఆయన హెచ్చరిస్తూ, "ఇప్పటికే ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నందున పెట్టుబడిలో అస్థిరత ఉండే అవకాశాలు ఎక్కువ" అన్నారు.
5/7అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం కొంత నెమ్మదింపు కనిపించింది. స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.52శాతం తగ్గి $3,621.91 వద్ద ట్రేడ్ అయింది. అదేవిధంగా స్పాట్ సిల్వర్ కూడా 0.35శాతం పడిపోయి ఔన్సుకు $41.01కి చేరుకుంది.
6/7HDFC సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ మాట్లాడుతూ, "పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ కన్స్యూమర్ ఇన్ఫ్లేషన్ రిపోర్ట్ మీదే ఉంది. ఆ నివేదికతో పాటు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే తదుపరి నిర్ణయాలపై మార్కెట్లు ఎక్కువగా ప్రభావితం అవుతాయి" అని తెలిపారు.
7/7ఈ పరిస్థితుల్లో పసిడి కొనుగోలు పెట్టుబడిదారులకు లాభదాయకం కావచ్చేమో కానీ, అనిశ్చితి కూడా ఎక్కువగా ఉందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి కొత్తగా పెట్టుబడి పెట్టేవారు జాగ్రత్తగా అడుగులు వేయాలని హెచ్చరిస్తున్నారు.