Gold Rate Today: బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటితో పోల్చి చూసినప్పటికీ బంగారం ధర నేడు తగినట్లు గమనించవచ్చు. మే 15వ తేదీ ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.95800, 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 88140, ఒక కేజీ వెండి ధర రూ.98500 చొప్పున నమోదైనట్లు గమనించవచ్చు. బంగారం ధరలు భారీగా తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న తగ్గుదలే ప్రధాన కారణం అని చెప్పవచ్చు.
అంతర్జాతీయ మార్కెట్లో గడచిన మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అమెరికా చైనా మధ్య కుదిరిన టారిఫ్ తగ్గింపు ఒప్పందంతో పాటు పెరుగుతున్న డాలర్ విలువ కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు. బంగారం ధరలు గతంలో ఒక లక్ష రూపాయలు దాటినట్టు గమనించవచ్చు.
అక్కడి నుంచి బంగారం ధర దాదాపు 5వేల రూపాయల వరకు తగ్గింది. దీంతో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది ఒక రకంగా చెప్పాలంటే స్వల్ప ఊరట. భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్లో ప్రస్తుతం ఒక ఔన్స్ (31.2 గ్రాములు) బంగారం ధర 3150 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
గతంలో ఇది 3500 డాలర్ల వద్ద ఆల్ టైం రికార్డులను బద్దలు కొట్టింది. అంటే బంగారం ధర దాదాపు 350 కాలర్లు తగ్గిందని గమనించవచ్చు. అంటే ఫ్యూచర్స్ మార్కెట్లో ప్రస్తుతం బంగారం ధర రూ.90,000 పలుకుతోంది. ఆల్ టైం రికార్డ్ స్థాయి కన్నా కూడా బంగారం ధర 10 వేల రూపాయలు తగ్గినట్లు గమనించవచ్చు. అయితే రిటైల్ మార్కెట్లో మాత్రం బంగారం ధర ఇంకా 95000 రూపాయల వద్ద ఉంది.
బంగారం ఫ్యూచర్స్ మార్కెట్ ధర ప్రస్తుతం రూ.10,000 తగ్గినట్లు గమనించవచ్చు. భవిష్యత్తులో బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని ఫ్యూచర్స్ మార్కెట్ ధరలు సూచిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం పెళ్లిలో సీజన్ కావడం వల్ల బంగారం ధరలు తగ్గడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా బంగారం ధర తగ్గిన వేళ ఫిజికల్ బంగారం కొనుగోలు చేసేవారు ప్రస్తుతం ఈ ధర వద్ద కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే బంగారం ధరలు భవిష్యత్తులో పెరగడం అది తగ్గడం అనేది పూర్తిగా అంతర్జాతీయ అంశాల పైన ఆధారపడి ఉంటాయి అన్న సంగతి గమనించాలి.