Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ప్రతిరోజూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నాయి. ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబాలు సులభంగా కొనగలిగిన పసిడి ఆభరణాలు ఇప్పుడు అందనంత ఎత్తుకు వెళ్లాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1.03 లక్షలు దాటగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,14,080 చేరింది. దీంతో పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం కొనడం చాలా కష్టమైపోయింది.
1/6బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి కారణమని చెప్పవచ్చు. అమెరికా స్టాక్ మార్కెట్లలో ఆర్థిక మాంద్యం భయాలు, డాలర్ విలువ పడిపోవడం, వడ్డీ రేట్ల తగ్గింపుపై ఉన్న ఊహాగానాలు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా మార్చాయి. పెట్టుబడిదారులు తమ డబ్బును గోల్డ్‌లో పెట్టడం ప్రారంభించడంతో డిమాండ్ భారీగా పెరిగింది. ఫలితంగా దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి.
2/6ఢిల్లీ బులియన్ మార్కట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.1,800 పెరిగి 10 గ్రాములకు రూ.1,15,100 వద్ద కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ఈ సమాచారాన్ని అందించింది. దీనితో పాటు, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా నేడు రూ.1,800 పెరిగి 10 గ్రాములకు రూ.1,14,600 రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. స్థానిక బులియన్ మార్కెట్లో, గత ట్రేడింగ్ సెషన్‌లో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం రూ.500-500 తగ్గి 10 గ్రాములకు రూ.1,13,300, రూ.1,12,800 వద్ద ముగిసింది.
3/6ఒకప్పుడు పండుగల సమయంలో బంగారు ఆభరణాల దుకాణాలు జనాలతో నిండిపోయేవి. కానీ ఇప్పుడు ధరలు ఆకాశాన్ని తాకడంతో దుకాణాలు వెలవెలబోతున్నాయి. సాధారణ కుటుంబాలు చిన్న చిన్న ఆభరణాలకే పరిమితం అవుతుండగా, కొందరు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. బంగారం కిలో ధరలు పెరగడం వల్ల కస్టమర్ల సంఖ్య తగ్గిపోగా, జువెలరీ వ్యాపారులు కూడా ఆందోళన చెందుతున్నారు.
4/6బంగారంతో పాటు వెండి ధర కూడా చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పెరిగింది. ఒక కిలో వెండి ధర రూ.1,32,627 చేరుకుంది. ఇండస్ట్రియల్ రంగంలో వెండి వినియోగం పెరగడం, పెట్టుబడిదారులు వెండిపైన కూడా ఆసక్తి చూపించడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
5/6బంగారం, వెండి రెండూ ఇప్పుడు పెట్టుబడిదారులకు అత్యంత సురక్షితమైన ఆప్షన్‌లుగా మారాయి. మార్కెట్లలో అనిశ్చితి పెరుగుతున్నప్పుడు ఇన్వెస్టర్లు ఎప్పుడూ గోల్డ్ వైపే మొగ్గు చూపుతారు. ప్రస్తుతం అదే జరుగుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందన్న ఊహాగానాలు బంగారంపై మరింత డిమాండ్ పెంచాయి.
6/6ఇలా ప్రతిరోజూ పెరుగుతున్న ధరల కారణంగా సాధారణ ప్రజలకు బంగారం కొనడం ఇప్పుడు కలలా మారిపోయింది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలని అనుకునే కుటుంబాలు ఆందోళనలో పడుతున్నారు. ఇకపై పసిడి ఆభరణాలు కొనడం సామాన్యులకు అందనంత దూరంగా మారిందని చెప్పాలి.