Add Zee Business As A Preferred Source
App

Gold Rate Today: దీపావళి పండగ ముందు మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం ధరలు.. నేడు అక్టోబర్ 18వ తేదీ ధరలు ఎలా ఉన్నాయంటే.!!

Written ByBhoomi
Published: Oct 18, 2025, 08:42 AM IST|Updated: Oct 18, 2025, 08:42 AM IST


Gold Rate Today: అక్టోబర్ 18వ తేదీ శనివారం నాటికి బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,31,760 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,100 గా నమోదైంది. అలాగే వెండి ధర కూడా భారీగా పెరిగి, కిలోకు రూ. 1,75,531 కు చేరుకుంది.

Prices likely to drop soon1/6

త్వరలో ధరలు తగ్గే అవకాశం

ఇటీవలి రోజుల్లో పసిడి ధరలు రోజురోజుకు పెరుగుతూ, పెట్టుబడిదారులు, ఆభరణాల కొనుగోలు దారులకు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే నేడు కూడా బంగారం ధరలు పెరగడం గమనార్హం. అయితే, ఈ పెరుగుదల కొంతకాలం మాత్రమే కొనసాగుతుందని, త్వరలో ధరలు తగ్గే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

US economic conditions around the world2/6

ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఆర్థిక పరిస్థితులు

ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువ, స్టాక్ మార్కెట్ దిశ, వడ్డీ రేట్ల మార్పులు బంగారం ధరలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్ సూచీలు ప్రస్తుతం పాజిటివ్ ట్రెండ్‌లో కొనసాగుతున్నందున, బంగారం ధరలు త్వరలో కొంత క్షీణించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.  

Central banks of many countries4/6

పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు

ప్రపంచంలోని పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇటీవలి కాలంలో బంగారం కొనుగోళ్లు తగ్గిస్తున్నాయి. దీనికి కారణం బంగారం ధరలు ఇప్పటికే రికార్డు స్థాయికి చేరుకోవడం, భవిష్యత్తులో కొంత తగ్గుదల ఉండొచ్చని అంచనా. ఈ నెలలో కూడా అనేక దేశాలు బంగారం నిల్వలను పరిమితం చేస్తున్నాయి.

Bank of America latest report5/6

బ్యాంక్ ఆఫ్ అమెరికా తాజా నివేదిక

బ్యాంక్ ఆఫ్ అమెరికా తాజా నివేదిక ప్రకారం, బంగారం ప్రస్తుతం  ఓవర్ బాట్  పొజిషన్‌లో ఉందని పేర్కొంది. అంటే, పెట్టుబడిదారులు ఎక్కువగా కొనుగోలు చేసిన కారణంగా మార్కెట్లో కరెక్షన్ వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు త్వరలో కొంత స్థిరపడవచ్చని అంచనా వేస్తున్నారు.  

Gold prices at all-time high6/6

బంగారం ధరలు ఆల్ టైమ్ హై

ప్రస్తుతం బంగారం ధరలు ఆల్ టైమ్ హై వద్ద ఉండటంతో, ఆభరణాల కొనుగోలు దారులకు ఇది భారీ భారం అవుతోంది. పసిడి ఆభరణాలు కొనాలంటే ఇప్పటి పరిస్థితుల్లో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. ధరలు ఇలాగే కొనసాగితే సాధారణ వినియోగదారులకు బంగారం అందుబాటులో ఉండడం కష్టమవుతుందని జ్యువెలరీ వ్యాపారులు చెబుతున్నారు.