Add Zee Business As A Preferred Source
App

Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధరలు ..సెప్టెంబర్ 1వ తేదీ సోమవారం నాటి ధరలు ఇవే..!

Written ByBhoomi
Published: Sep 01, 2025, 08:31 AM IST|Updated: Sep 01, 2025, 08:31 AM IST

Gold Rate Today: సెప్టెంబర్ 1వ తేదీ  సోమవారం  దేశీయ బంగారం ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ. 1,04,979గా కొనసాగుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 96,229 వద్ద పలుకుతోంది. ఇదే సమయంలో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఒక కిలో వెండి ధర రూ. 1,28,000 పలుకుతోంది. గత వారం నుంచి బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నప్పటికీ ఆదివారం ధరలతో పోల్చితే నేడు సోమవారం  స్వల్పంగా తగ్గడం వినియోగదారులకు కొంత ఉపశమనం ఇచ్చిందని చెప్పవచ్చు. అయినప్పటికీ ధరలు ఇంకా చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి.

Gold Rate Today1/6

కొన్ని వారాలుగా పసిడి ధరలు

గడచిన కొన్ని వారాలుగా పసిడి ధరలు ప్రతిరోజూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడి మార్గంగా ఎంచుకోవడం వల్ల దేశీయంగా కూడా డిమాండ్ పెరిగి ధరలు ఎగసిపడుతున్నాయి. 

Gold Rate Today2/6

22 క్యారెట్ల బంగారం ధర

ముఖ్యంగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 96 వేల రూపాయల దాటడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఒక చిన్న బంగారు ఆభరణం కొనుగోలు చేయాలన్నా భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ప్రస్తుతానికి 10 గ్రాముల బంగారు చైన్ ధర దాదాపు రూ. 1.15 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. 

Gold Rate Today3/6

బంగారం ధరల్లో పెరుగుదల

బంగారం ధరల్లో పెరుగుదలకు ప్రధాన కారణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకుంటున్న అస్థిరతేకారణమని చెప్పుకోవచ్చు.  అమెరికా స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు గురవుతుండటంతో పాటు, డాలర్ విలువ గణనీయంగా పడిపోవడం బంగారం ధరలు పెరగడానికి దోహదపడుతోందని చెప్పాలి.   

Gold Rate Today4/6

ఇన్వెస్టర్లు తమ డబ్బును

దీంతో ఇన్వెస్టర్లు తమ డబ్బును సురక్షిత ఆస్తుల్లో పెట్టాలని భావించడం వల్ల బంగారంపై డిమాండ్ మరింతగా పెరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అమెరికా మార్కెట్‌లో ఒక ఔన్స్ బంగారం ధర రూ.3,500 దాటింది. ఇది చారిత్రాత్మక స్థాయిగా పరిగణిస్తున్నారు. ఫలితంగా దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగి వినియోగదారులపై అదనపు భారాన్ని మోపుతున్నాయి.

Gold Rate Today5/6

భారతీయులలో బంగారం కొనుగోలు

భారతీయులలో బంగారం కొనుగోలు అనేది సంప్రదాయంగా ఒక భాగమని చెప్పవచ్చు. పెళ్లిళ్లు, పండుగలు, ప్రత్యేక సందర్భాలు  ప్రతి వేడుకలోనూ బంగారం ఆభరణాలు ముఖ్యపాత్ర పోషిస్తుందని చెప్పాలి. కానీ ఇప్పుడు బంగారం ధరలు లక్ష రూపాయలకుపైగా ఉండటంతో, సాధారణ మధ్యతరగతి ప్రజలకు ఆభరణాలు కొనుగోలు చేయడం మరింత కష్టతరంగా మారింది. పెళ్లిళ్ల సీజన్‌ దగ్గరపడుతుండడంతో, కొనుగోలుదారులు ఇంకా ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

Gold Rate Today6/6

బంగారం ధరలు సమీప కాలంలో

నిపుణుల అంచనాల ప్రకారం, బంగారం ధరలు సమీప కాలంలో కూడా అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి మార్పులు చెందుతాయి. డాలర్ విలువ, అమెరికా ఆర్థిక పరిస్థితులు, గ్లోబల్ డిమాండ్, పెట్టుబడిదారుల నిర్ణయాలు ఇవన్నీ కూడా  బంగారం రేట్లను ప్రభావితం చేసే ప్రధాన అంశాలుగా చెప్పవచ్చు. అందువల్ల వచ్చే రోజుల్లో కూడా బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.