Add Zee Business As A Preferred Source
App

Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్ .. మళ్లీ తగ్గిన పసిడి ధర.. అక్టోబర్ 21వ తేదీ మంగళవారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Written ByBhoomi
Published: Oct 21, 2025, 08:41 AM IST|Updated: Oct 21, 2025, 08:41 AM IST

Gold Prices October 21: అక్టోబర్ 21వ తేదీ మంగళవారం నాడు దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు మార్కెట్ రేట్ల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,690 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,19,800గా నమోదైంది.
వెండి విషయానికొస్తే, ఒక కిలో ధర ప్రస్తుతం రూ. 1,70,000 వద్ద పలుకుతోంది.

Gold prices remain stable1/6

బంగారం ధరలు స్థిరం

ఇటీవలి మూడు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ, ఈ తగ్గుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో మారిన పరిస్థితులు అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డాలర్ విలువ గత వారంతో పోలిస్తే పెరిగిన కారణంగా బంగారం ధరలపై ఒత్తిడి ఏర్పడింది. సాధారణంగా డాలర్ బలహీనపడితే బంగారం పెట్టుబడులు పెరుగుతాయి. అయితే డాలర్ బలపడినప్పుడు బంగారం ధరలు తగ్గడం సహజం.  

Gold prices hit all-time record2/6

బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డు

ఇన్వెస్టర్లు బంగారాన్ని ఎప్పటికీ సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తారు. కానీ ఇటీవల బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డును తాకడంతో భౌతిక బంగారం కొనుగోళ్లు తగ్గాయి. ధంతేరస్ వంటి పర్వదినాల్లో కూడా బంగారం దుకాణాల్లో కొనుగోలు తక్కువగానే నమోదైంది అని వ్యాపారులు చెబుతున్నారు.

Digital Gold3/6

డిజిటల్ గోల్డ్

అయితే మరోవైపు, డిజిటల్ గోల్డ్ మీద పెట్టుబడి ఆసక్తి గణనీయంగా పెరిగింది. ఫిజికల్ గోల్డ్‌కి బదులుగా గోల్డ్ ETFలు, సావరిన్ గోల్డ్ బాండ్లు వంటి సురక్షిత పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు మళ్లారు.

According to the latest report by ICRA Analytics4/6

ICRA Analytics తాజా నివేదిక ప్రకారం

ICRA Analytics తాజా నివేదిక ప్రకారం, 2025 సెప్టెంబర్ నెలలో గోల్డ్ ETFలలోకి వచ్చిన నికర ఇన్‌ఫ్లోలు 550 శాతం పెరిగి రూ. 8,363 కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే నెలలో ఇవి కేవలం రూ. 1,233 కోట్లు మాత్రమే ఉన్నాయి. గత ఐదేళ్లలో గోల్డ్ ETF ఇన్‌ఫ్లోలు సగటున 69.5శాతం CAGR వృద్ధి సాధించాయని సంస్థ పేర్కొంది. ఇది పెట్టుబడిదారులు డిజిటల్ రూపంలోని బంగారంపై నమ్మకం పెంచుకున్నారనే సంకేతం.

Silver price per kilo5/6

కిలో వెండి ధర

వెండి మార్కెట్ కూడా నిశ్చలంగా లేదు. గతంలో ఒక కిలో వెండి ధర రూ. 2 లక్షల వరకు చేరినప్పటికీ, ప్రస్తుతం అది రూ. 1.70 లక్షల వద్ద ఉంది. గత కొద్ది వారాలుగా వెండి ధరలు కూడా బంగారంలా స్థిరత్వం కోల్పోయి తగ్గుముఖం పట్టాయి.

Dollar in international markets6/6

అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్

మొత్తానికి, అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలం పెరగడం, పెట్టుబడిదారులు డిజిటల్ బంగారం వైపు మొగ్గు చూపడం, దేశీయ డిమాండ్ తగ్గడం వంటి అంశాలు కలసి పసిడి ధరలను కొంత వెనక్కి నెట్టాయి. అయితే దీర్ఘకాలంగా చూస్తే బంగారం ఇప్పటికీ సురక్షిత పెట్టుబడి ఎంపికగానే కొనసాగుతోంది.