Gold Rate Today: పెరగడమే.. దిగడం కుదరదంటున్న బంగారం ధరలు.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే నేడు మార్చి 24వ తేదీ సోమవారం మాత్రం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ ఆర్థిక రాజధాని ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,713 ఉండగా..24క్యారెట్ల తులం బంగారం ధర రూ. 88,050 వద్ద కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నేటి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. 
 

1 /7

Gold Rate Today: ఈమధ్యే జీవిత కాల గరిష్టానికి చేరుకున్న బంగారం ధర  స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. కొన్నిరోజులుగా వరుసగా చుక్కలు చూపిస్తున్న బంగారం ధర  నేడు మార్చి 24వ తేదీ సోమవారం రోజున స్వల్ప తేడాతో యథావిధిగా కొనసాగుతోంది.   

2 /7

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో భారీగా పెరిగిన బంగారం ధరల్లో నేడు  ఎలాంటి మార్పు లేదు. సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80, 566 ఉండగా..24క్యారెట్ల తులం బంగారం ధర రూ. 87,890వద్ద కొనసాగుతోంది.   

3 /7

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 80, 841 ఉండగా 24క్యారెట్ల బంగారం ధర రూ. 88,190 వద్ద కొనసాగుతోంది. అయితే మరికొన్ని రోజుల్లో బంగారం ధర రూ. లక్ష దాటే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ పండితులు చెబుతున్నారు. 

4 /7

దేశవ్యాప్తంగా బంగారం (22, 24 క్యారెట్ల): కోల్‌కతా- రూ.80,603, రూ.87,930, చెన్నై- రూ.80,942, రూ.88,300,  బెంగళూరు- రూ.80,777, రూ.88,120, పుణె- రూ.రూ.80,713, రూ.88,050  

5 /7

ఇక వెండి ధరల్లోనూ స్వల్ప తేడాలు ఉన్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర ఆదివారం రూ. 97, 730 ఉంది. నేడు రూ. 97,740కి చేరుకుంది.   

6 /7

ముంబైలో నిన్న కిలో వెండి ధర రూ. 97, 900 ఉంది. నేడు రూ. 97, 910 వద్ద కొనసాగుతోంది.   

7 /7

తెలుగు నగరాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర ఆదివారం రూ. 98,050 ఉంది. నేడు రూ. 98, 060కి చేరుకుంది.