Add Zee Business As A Preferred Source
App

Gold Rate Today: మహిళలకు భారీ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..ఏకంగా రూ. 10,000 తగ్గింపు..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..?

Written ByBhoomi
Published: Aug 02, 2025, 01:24 AM IST|Updated: Aug 02, 2025, 01:24 AM IST

Gold Rate Today: గత కొన్ని రోజులుగా బంగారం ధర ఆల్ టైం రికార్డులను తాకుతోంది. బంగారం ధర భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇబ్బందికర పరిస్థితులు నెలకున్నాయని చెప్పవచ్చు. అయితే అంతర్జాతీయంగా గమనించినట్లయితే బంగారం ధరలు భారీగా దిగివస్తున్నాయి. అందుకు దారి తీసిన పరిణామాలేంటో ఇప్పుడు చూద్దాం. 
 

 బంగారం ధరలు 1/6

బంగారం ధరలు

 స్టాకిస్టుల నిరంతర అమ్మకాల కారణంగా ఈరోజు బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి. శనివారం  వరుసగా మూడో  రోజు బంగారం ధరలు తగ్గాయి. నేడు ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ.400 తగ్గి రూ.97,620కి చేరుకుంది. శుక్రవారం దాని ధర 10 గ్రాములకు రూ.500 తగ్గి రూ.98,020కి చేరుకుంది. దీనితో నేడు 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాములకు రూ.300 తగ్గి రూ.97,500కి చేరుకుంది. శనివారం ఇది రూ.400 తగ్గి రూ.97,800పలుకుతోంది.   

వెండి ధర2/6

వెండి ధర

శనివారం  వెండి ధర వరుసగా రెండవ రోజు కూడా భారీగా తగ్గింది. నేడు వెండి ధర కిలోకు రూ.2500 తగ్గి రూ.1,09,500కి చేరుకుంది. శుక్రవారం వెండి ధర రూ.2000 తగ్గి కిలోకు రూ.1,12,000 వద్ద ముగిసింది.   

 ఆల్ టైం రికార్డు3/6

ఆల్ టైం రికార్డు

బంగారం ధరలు ప్రతిరోజూ ఆల్ టైం రికార్డును క్రియేట్ చేస్తు ముందుకు దూసుకెళ్తున్నాయి. బంగారం ధర గత నెల రోజుల్లో రూ. 1,05,000 రూపాయల వద్ద ఆల్ టైం రికార్డును తాకింది. అయితే ప్రస్తుతం ఆల్ టైం రికార్డుతో పోల్చి చూస్తే తక్కువగానే ట్రేడ్ అవుతుందని చెప్పవచ్చు. 

అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులే4/6

అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులే

బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులే కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా బంగారం ధర ప్రస్తుతం లక్ష రూపాయల పైనే ట్రేడ్ అవుతోంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుముఖం పట్టినట్లు చూడవచ్చు.   

ఒక ఔన్స్ ప్రస్తుతం 3330 డాలర్ల 5/6

ఒక ఔన్స్ ప్రస్తుతం 3330 డాలర్ల

అమెరికా కామెక్స్ ట్రేడింగ్ ఫ్యూచర్ మార్కెట్లో ఒక ఔన్స్ ప్రస్తుతం 3330 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. గతంలో బంగారం ధర ఒక ఔన్స్ 3450 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. ఈ లెక్కన చూస్తే బంగారం ధర దాదాపు 120 డాలర్లు తగ్గింది. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 10వేల రూపాయలు తగ్గింది. బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి నుంచి తగ్గడానికి ప్రధానంగా డాలర్ విలవ బలపడటం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.   

ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలు 6/6

ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలు

అయితే ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గినప్పటికీ రిటైల్ మార్కెట్లో తగ్గడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయి తాకిన తరుణంలో బంగారు ఆభరణాల ధరలు కూడా భారీగా పెరిగాయి.