Add Zee Business As A Preferred Source
App

Gold Rate Today: తగ్గేదేలే అంటోన్న పసిడి.. తులం ధర రూ. 1.09లక్షలపైనే..సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారం ధరలు ఇవే..!!

Written ByBhoomi
Published: Sep 05, 2025, 07:29 AM IST|Updated: Sep 05, 2025, 07:29 AM IST

Gold Rate Today:  బంగారం ధరలు ప్రతిరోజూ కొత్త కొత్త రికార్డులు నమోదు చేస్తూ భారీగా పెరుగుతున్నాయి. పసిడి రేట్లు సామాన్య ప్రజలకు  అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. శుక్రవారం సెప్టెంబర్ 5వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,09,250గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,350కు చేరింది. మరోవైపు వెండి ధర కూడా చరిత్రలో ఎన్నడూ లేనంత ఎత్తుకు వెళ్లి కిలోకు రూ.1,26,000 పలికింది.
 

Gold price in India1/6

అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల ప్రభావం

బంగారం ధరల పెరుగుదల వెనుక అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్లలో స్టాక్ సూచీలు క్షీణిస్తున్నాయి. అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలను చవిచూస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు పడిపోతే, పెట్టుబడిదారులు సేఫ్ హావెన్‌గా పసిడిని ఆశ్రయించడం సహజం. దీంతో డిమాండ్ పెరిగి ధరలు ఎగబాకుతున్నాయని చెప్పవచ్చు.  

International gold rate2/6

డాలర్ విలువ తగ్గడం

ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే డాలర్ విలువ తగ్గడం. డాలర్ బలహీనపడినప్పుడు, అంతర్జాతీయంగా బంగారానికి విలువ పెరుగుతుంది. ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం 3,600 డాలర్లను దాటింది. ఇది చరిత్రలోనే అరుదైన స్థాయి అని చెప్పవచ్చు. అదే సమయంలో వెండికి కూడా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా పరిశ్రమలలో వినియోగం పెరిగినందున, వెండి ధరలు కూడా బంగారంతో పోటీ పడుతూ వెండి కూడా పరుగులు పెడుతున్నాయి.

Dollar vs Gold3/6

మార్కెట్లో పసిడి ధరల పెరుగుదల

భారతీయ మార్కెట్లో పసిడి ధరల పెరుగుదల వలన ఆభరణాల కొనుగోలు ఖర్చులు విపరీతంగా పెరిగాయి.  22 క్యారెట్ల 10 గ్రాములు 98 వేల రూపాయలు దాటింది. ఒక చిన్న గోల్డ్ చైన్  కూడా కొనాలంటే కనీసం రూ.1.15 లక్షల వరకు  ఖర్చు చేయాల్సి వస్తోంది. అదనపు మేకింగ్ చార్జీలు, జీఎస్టీ వంటివి కలిస్తే ఈ భారం మరింత పెరుగుతుంది.

Record gold prices4/6

బంగారం కొనుగోలు

నిపుణులు చెబుతున్నది ఏమిటంటే, ఈ పరిస్థితుల్లో బంగారం కొనుగోలు చేసే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒక గ్రాము బరువులో కూడా తేడా వస్తే, వేల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడిగా బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Gold investment in Telugu5/6

స్టాక్ మార్కెట్ల అస్థిరత

పసిడి ధరల పెరుగుదల వెనుక స్టాక్ మార్కెట్ల అస్థిరత, డాలర్ బలహీనత, అంతర్జాతీయ డిమాండ్ ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇకపై బంగారం, వెండి రేట్లు ఎలా మారతాయో చూడాల్సి ఉంది కానీ, ప్రస్తుత స్థాయిలు సాధారణ వినియోగదారులకు భారమైపోతున్నాయి.

Disclaimer:6/6

డిస్ క్లైమర్

Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో  పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.