Gold Rate Today: దేశంలో బంగారం ధరలు చరిత్రలో ఎప్పుడూ లేనంత స్థాయికి చేరుకున్నాయి. ప్రతి రోజు కొత్త రికార్డులను బద్దలు కొడుతున్న బంగారం ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. సెప్టెంబర్ 6వ తేదీ శనివారం బంగారం ధరలు చూస్తే..24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,10,570 వరకు పెరిగింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.99,050 పలుకుతోంది. ఇది సాధారణ కొనుగోలు దారులకు, ముఖ్యంగా ఆభరణాల కొనుగోలుదారులకు పెద్ద భారంగా మారిందని చెప్పవచ్చు.
1/6గడచిన వారం రోజులుగా బంగారం ధర ప్రతిరోజూ కనీసం రూ. 1000 మేర పెరుగుతూ వచ్చింది. మొత్తం మీద ఒక వారం వ్యవధిలోనే 7 వేల రూపాయలు పెరిగింది. చరిత్రలో తొలిసారిగా బంగారం 1.10 లక్షల రూపాయలు దాటడం ఆర్థిక నిపుణులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే సమయంలో వెండి ధర కూడా భారీ ఎత్తున పెరిగింది. ఒక కేజీ వెండి ధర రూ.1,27,125 చేరడం కొత్త రికార్డుగా నిలిచింది.
2/6ఇక ఈ పెరుగుదల వెనుక ఉన్న ప్రధాన కారణాలను పరిశీలిస్తే, అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అమెరికా మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు 3639 డాలర్ల వరకు పెరిగి ఆల్‌టైమ్ హైకి చేరుకుంది.
3/6డాలర్ విలువ గణనీయంగా పడిపోవడం, స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న నెగెటివ్ ట్రెండ్ కారణంగా ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారని చెప్పవచ్చు. దీంతో భారీగా పెట్టుబడులు బంగారంలోకి మళ్లడంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
4/6పసిడి ధరలు పెరగడం వలన సాధారణ ప్రజలకు ఆభరణాల కొనుగోలు ఒక పెద్ద సవాలుగా మారింది. ఒక తులం 22 క్యారెట్ల బంగారం ఇప్పుడు లక్ష రూపాయల వరకు చేరడం వలన పెళ్లిళ్లు, వేడుకలు వంటి సందర్భాల్లో బంగారు ఆభరణాలు కొనడం కష్టసాధ్యమవుతోంది. జ్యువెలరీ మార్కెట్లో డిమాండ్ తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, పెరుగుతున్న అంతర్జాతీయ రేట్లు స్థానిక మార్కెట్లో కూడా ప్రభావం చూపుతున్నాయి.
5/6వెండి ధర పెరగడానికి మరో కారణం ఇండస్ట్రియల్ డిమాండ్. ఎలక్ట్రానిక్స్, సౌరశక్తి, మెడికల్ పరికరాల తయారీలో వెండి వాడకం పెరుగుతోంది. దీని వలన వెండి ధరలు చరిత్రలో లేని స్థాయికి చేరుకున్నాయి.
6/6మొత్తం మీద బంగారం, వెండి ధరల పెరుగుదల ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల ప్రతిబింబంగా మారింది. ఇది పెట్టుబడిదారులకు లాభం కాగలిగినప్పటికీ, సాధారణ వినియోగదారులకు మాత్రం పెద్ద ఇబ్బందిగా మారింది.