Gold Rate Today: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఎప్పటికీ లేనివిధంగా ఎగబాకుతూ చరిత్ర సృష్టిస్తున్నాయి. సెప్టెంబర్ 9వ తేదీ మంగళవారం నాడు 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,12,070కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 99,750గా నమోదైంది. ఒక కిలో వెండి ధర కూడా భారీగా పెరిగిన రూ. 1,28,125 పలికింది. గత రెండు వారాల వ్యవధిలో బంగారం ధర ప్రతిరోజు వెయ్యి రూపాయల చొప్పున పెరిగి మొత్తంగా రూ.12,000 పైగా పెరగడం విశేషం.
1/6ఇప్పటి వరకు ఏనాడు లేని విధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.12 లక్షల రూపాయలు దాటి బంగారం చరిత్రలోనే సరికొత్త మైలు రాయి దాటిందని చ చెప్పవచ్చు. వరుసగా 10 రోజులు బంగారం ధరలు పెరగడం ఇదే మొదటిసారి.
2/6అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న పరిణామాలు, ముఖ్యంగా అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర $3,700 దాటడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పసిడి రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి.
3/6పసిడి ధరలు ఇంతలా పెరగడంతో ఆభరణాలు కొనుగోలు చేయదలచిన వారికి ఇది పెద్ద భారమైంది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర దాదాపు లక్ష రూపాయలకు చేరుకోవడంతో ఒక తులం ఆభరణాలు కొనాలంటే లక్ష రూపాయలకు పైగా వెచ్చించాల్సి వస్తోంది. ఇది ముఖ్యంగా పెళ్లిళ్లు లేదా ఇతర వేడుకల కోసం బంగారం కొనాలని చూస్తున్న కుటుంబాలకు తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తోంది.
4/6నిపుణుల అభిప్రాయం ప్రకారం, డాలర్ విలువ భారీగా పడిపోవడం, స్టాక్ మార్కెట్లో ఉన్న అస్థిరత కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ తరలింపే బంగారం ధరలను నియంత్రణలో లేకుండా పెంచేస్తోంది.
5/6వెండి ధరలు కూడా పసిడి తరహాలోనే రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఒక కిలో వెండి ధర రూ. 1.28 లక్షలకు చేరుకోవడం ఇప్పటి వరకు లేని స్థాయి. పరిశ్రమలలో వెండి వినియోగం పెరగడం దీని ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
6/6మొత్తానికి, బంగారం-వెండి ధరల పెరుగుదల సాధారణ వినియోగదారులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. పెట్టుబడిదారులకు ఇది లాభదాయకమైనా, ఆభరణాల కొనుగోలు చేసే వారికి మాత్రం పెద్ద ఆర్థిక భారంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ పెరుగుదల కొనసాగుతుందా, లేక తగ్గుతుందా అనేది మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.