Add Zee Business As A Preferred Source
App

Gold Rate Today: బంగారం మరో కొత్త రికార్డ్.. ఏకంగా రూ. 2లక్షలు..సెప్టెంబర్ 13వ తేదీ శనివారం వెండి, బంగారం ధరలు ఇవే..!!

Written ByBhoomi
Published: Sep 13, 2025, 10:57 AM IST|Updated: Sep 13, 2025, 10:57 AM IST

Gold Rate Today:  సెప్టెంబర్ 13, శనివారం నాడు బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయంగా కూడా బంగారం, వెండి ధరలు ఆల్‌టైం హై స్థాయికి చేరుకున్నాయి.

Gold Price Today Telangana1/6

10 గ్రాముల బంగారం ధర

ఈ రోజు బంగారం ధరలను పరిశీలిస్తే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,210 గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,400 కు చేరింది. అంతేకాదు, ఒక కిలో వెండి ధర రూ. 1,31,675 పలికింది. ఈ రేట్లు బంగారం, వెండి మార్కెట్లో చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Silver Price Today India2/6

బంగారం ధరలు ఆల్‌టైం రికార్డు

గత రెండు వారాలుగా బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు ఆల్‌టైం రికార్డు స్థాయిని దాటేశాయి. అమెరికా మార్కెట్‌లో ఒక ఔన్స్ (సుమారు 31.2 గ్రాములు) బంగారం ధర 3,700 డాలర్లకు చేరడంతో గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ ర్యాలీ మొదలైంది. దీని ప్రభావం నేరుగా భారత మార్కెట్‌పై పడింది.

Gold Hits All Time Record3/6

డాలర్ విలువ పడిపోవడం

బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం డాలర్ విలువ పడిపోవడం, స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి పరిస్థితులు అని చెబుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా కదులుతుందనే భయంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. దీని ఫలితంగా గోల్డ్ డిమాండ్ విపరీతంగా పెరిగింది.

24 Carat Gold Rate Today4/6

గోల్డ్ ETF స్కీముల్లో కూడా భారీగా పెట్టుబడులు

ఇటీవల గోల్డ్ ETF స్కీముల్లో కూడా భారీగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. సేఫ్ హావెన్‌గా భావించే బంగారం వైపు పెట్టుబడిదారుల ఆకర్షణ పెరగడంతో రేట్లు చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా 22 క్యారెట్ల బంగారం ధర 1.02 లక్షల రూపాయలు దాటడం చరిత్రలో తొలిసారి నమోదైంది.

22 Carat Gold Rate in India5/6

వెండి కూడా ఆల్‌టైం రికార్డు

బంగారం మాత్రమే కాకుండా, వెండి కూడా ఆల్‌టైం రికార్డును సృష్టించింది. వెండి ధర తొలిసారిగా కిలోకు 1.30 లక్షల రూపాయలు దాటింది. ఇండస్ట్రియల్ డిమాండ్ పెరగడం, అలాగే పెట్టుబడిదారుల ఆకర్షణ కారణంగా వెండి ధరలు విపరీతంగా పెరిగినట్లు చెబుతున్నారు.

Silver All Time High Price6/6

ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి

నిపుణులు చెబుతున్నదేమిటంటే, ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కొనసాగినంతకాలం బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని. పెట్టుబడిదారులు కూడా ఈ పరిస్థితిని లాభంగా మలచుకోవడానికి గోల్డ్, సిల్వర్ వైపు దృష్టి సారిస్తున్నారని  చెబుతున్నారు.