Gold Rate Today: సెప్టెంబర్ 15వ తేదీ సోమవారం నాటి బంగారం, వెండి ధరలు మరోసారి వినియోగదారుల దృష్టిని ఆకర్షించాయి. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,970గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,01,000కు చేరుకుంది. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఒక కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.1,31,000గా నమోదైంది.
1/6గడిచిన రెండు వారాలుగా పసిడి ధరలు భారీ ఎత్తున పెరుగుతున్నాయి. అయితే నిన్నటితో పోల్చితే నేటి రేట్లు స్వల్పంగా తగ్గాయి. అయినప్పటికీ, మొత్తం ట్రెండ్ చూస్తే బంగారం ధరలు ప్రతిరోజూ కొత్త రికార్డులను నమోదు చేస్తూ ముందుకు సాగుతున్నాయి.
2/6నిపుణుల విశ్లేషణ ప్రకారం బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం డాలర్ విలువ క్షీణించడం అని చెబుతున్నారు. ప్రపంచ మార్కెట్లో అమెరికన్ డాలర్ బలహీనపడటంతో, ఇన్వెస్టర్లు సేఫ్ హావెన్‌గా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. దానికి తోడు స్టాక్ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి, నెగటివ్ ట్రెండ్ కూడా పసిడి ధరల పెరుగుదలకు తోడ్పడుతున్నాయి.
3/6అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, ఆర్థిక పరిణామాలు కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒత్తిడి, వాణిజ్య సుంకాల ప్రభావం వలన ఇన్వెస్టర్లు బంగారంపైనే ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్‌లో ఒక ఔన్స్ బంగారం ధర చరిత్రలోనే తొలిసారి 3,700 డాలర్లను దాటింది.
4/6భారతదేశంలో పండుగ సీజన్ మొదలైన నేపథ్యంలో డిమాండ్ మరింతగా పెరిగింది. ఆభరణాల కోసం పెరిగిన డిమాండ్ కూడా రిటైల్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడానికి ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
5/6బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి రూ.1,31,000గా ఉంది. వెండి ధరలు పెరగడానికి ముఖ్య కారణం ఇండస్ట్రియల్ డిమాండ్ విపరీతంగా పెరగడమే. ఎలక్ట్రానిక్స్, సోలార్ వంటి రంగాల్లో వినియోగం అధికమవుతుండటంతో వెండి ధరలు ఆల్ టైం రికార్డులను తాకుతున్నాయి.
6/6బంగారం, వెండి ధరలు ఇంతగా పెరగడం వలన సాధారణ వినియోగదారులు, ముఖ్యంగా ఆభరణాలు కొనుగోలు చేసేవారికి ఇది భారంగా మారింది. పెళ్లిళ్లు, పండుగలు దగ్గరపడుతున్న ఈ సమయంలో ధరలు తగ్గే సూచనలు లేకపోవడంతో, కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు.