Gold Price Today: దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్నబంగారం ధరలు నేడు నాలుగో రోజు కూడా తగ్గాయి. దీపావళి తర్వాత నుంచి తగ్గుతూ వస్తున్న ధరలు నేడు నవంబర్ 7వ తేదీ శుక్రవారం కూడా తగ్గాయి. దీపావళికి 1,31,000 రూపాయలు పలికిన బంగారం ధర ఇప్పుడు తులంపై దాదాపు 9 నుంచి 10వేలు తగ్గింది. కాగా నేడు 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,21,470 పలుకుతోంది.
దేశంలో బంగారం ధర వరుసగా నాలుగో రోజు తగ్గింది. నవంబర్ 7వ తేదీ దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.121,620కి పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం పలుకుతోంది. వెండి ధర కూడా తగ్గింది. దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో తాజా బంగారం ధరలను తెలుసుకుందాం.
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 121,620. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 111,490 పలుకుతోంది.
ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.111340 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.121470గా ఉంది.
పూణే, బెంగళూరు.. ఈ రెండు నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.121470గా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.111340గా ఉంది.
డిసెంబర్ 2026 నాటికి బంగారం ఔన్సుకు $4,900 కు చేరుకుంటుందని గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేసింది. వచ్చే ఏడాది మధ్య నాటికి బంగారం ఔన్సుకు $4,600 కు చేరుకుంటుందని ANZ విశ్వసిస్తోంది. DSP మెర్రిల్ లించ్ కూడా బంగారు ర్యాలీ ఇంకా ముగియలేదని చెబుతున్నారు.
వెండి ధర కూడా క్రమంగా తగ్గుతోంది. నవంబర్7న కిలోకు రూ.150,400గా ఉంది. దేశంలో బంగారం, వెండి ధరలు దేశీయ అంశాలతో పాటు ప్రపంచ అంశాలచే ప్రభావితమవుతాయి. నవంబర్ 6వ తేదీ బుధవారం ఇండోర్ బులియన్ మార్కెట్లో వెండి ధర కిలోకు రూ.500 తగ్గింది. సగటు ధర కిలోకు రూ.148,500గా ఉంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.