Gold Rate: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మధ్య సుంకాల యుద్ధం ముదిరింది. దీంతో బంగారం ధరలు చరిత్రలోనే తొలిసారిగా 3200 డాలర్ల మార్కును దాటి ట్రేడ్ అవుతున్నాయి. ఇదే ఆల్ టైమ్ గరిష్ట స్థాయి అని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయంగా 3200 డాలర్లను దాటిన ధరలు, దేశీయంగాను రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. బలహీనమైన డాలర్, ఫెడ్ విధానంపై అంచనాలు కూడా ధరల పెరుగుదలకు కారణమయ్యాయని చెప్పవచ్చు.
Gold Rate: ప్రపంచ ఆర్థిక రంగంలో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మధ్య ముదురుతున్న సుంకాల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. దీంతో చరిత్రలో తొలిసారిగా నేడు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 3200 డాలర్ల మార్కును దాటేసింది. ప్రస్తుతం ఇప్పుడు 3328 డాలర్ల వద్ద ఉంది. ఈ క్రమంలోనే ఆల్ టైమ్ హై వాల్యూ నమోదు చేసింది. ఇలా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది.
ట్రంప్ మొదట చైనాపై దిగుమతి సుంకాలను భారీగా పెంచారు. బీజింగ్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తూ అమెరికా వస్తువులపై సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ఇరు దేశాల నేతలు పట్టుదల ప్రపంచ వాణిజ్యానికి పెను సవాలుగా మారింది.
వాణిజ్య యుద్ధం, ఆర్థిక మాంద్యం భయాలు కూడా పెరిగిపోయాయి. దీంతో అనిశ్చితినెలకొన్న మార్కెట్లో సురక్షిత పెట్టుబడి అయిన బంగారం వైపు మదుపరులు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ఆ ధరలు కూడా అందకుండా పోతున్నాయని చెప్పవచ్చు.
దేశీయంగానూ బంగారం ధరలు సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తున్నాయి. ఎంసీఎక్స్ లో పసిడి ధర జూన్ ఫ్యూచర్స్ ఒక్కసారిగా 1.41 శాతం పెరిగి 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 93, 736 వద్ద ఆల్ టైం గరిష్టాన్ని తాకింది. అంతకుముందు గురువారం కూడా బంగారం లాభాల్లోనే ముగిసింది. వెండి ధరలు కూడా అదే బాటలోనే పయనిస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలో చూస్తే 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ. 87, 450 కు చేరుకుంది. నేడు ఒక్కరోజే రూ. 1850పెరిగింది. కిందటి రోజు రూ. 2700ఎగబాకింది. ఇక 24క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. 95, 400 కు చేరుకుంది.
అయితే మార్కెట్ నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం అమెరికా చైనా మధ్య ఈ సుంకాల పోరు కొనసాగితే బంగారానికి మరింత డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.