Add Zee Business As A Preferred Source
App

Gold: భలే జాక్‌పాట్‌.. మూడు కిలోమీటర్ల భూగర్భంలో బంగారు గని.. త్వరలోనే టెండర్లు..!!

Written ByBhoomi
Published: Sep 26, 2025, 01:27 PM IST|Updated: Sep 26, 2025, 06:06 PM IST

Gold Reserves Found In Rajasthan: భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగదారుగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.  కానీ దేశీయ ఉత్పత్తి మాత్రం చాలా పరిమితంగా ఉంది. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలోని బన్స్వారా జిల్లాలో మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త బంగారు గనిని గుర్తించారు. 

 Gold Mine1/8

ఆర్థికంగా ఉపశమనం

ఈ గని రాష్ట్రానికి మాత్రమే కాకుండా దేశానికి కూడా ఆర్థికంగా ఉపశమనం కలిగించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. 

Rajasthan2/8

గ్పురా, భాకియాలలో బంగారు గనులు

ఈ జిల్లాలో జగ్పురా, భాకియాలలో బంగారు గనులు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడవ గని వెలుగులోకి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Banswara3/8

మైనింగ్ ప్రారంభించడానికి టెండర్లు

త్వరలో ఈ గనిలో మైనింగ్ ప్రారంభించడానికి టెండర్లు ఆహ్వానించనున్నట్లు సమాచారం.

Mining News4/8

ఆధునిక సాంకేతికత

భూగర్భంలో దాగి ఉన్న బంగారాన్ని కనుగొనడానికి ఆధునిక సాంకేతికతను శాస్త్రవేత్తలు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (GPR) సాంకేతికత ద్వారా నేల పొరలలో లోహాల ఉనికిని గుర్తిస్తారు. అలాగే వెరీ లో ఫ్రీక్వెన్సీ (VLF) విధానం ద్వారా విద్యుదయస్కాంత తరంగాలను భూగర్భంలోకి పంపి ఖననం చేయబడ్డ లోహాలను గుర్తిస్తారు. 

Gold Discovery5/8

ఖనిజాల ఉనికి

ఈ ప్రక్రియల ద్వారా ఖనిజాల ఉనికిని నిర్ధారించిన తర్వాతే తవ్వకాలు ప్రారంభమవుతాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే, బంగారం ఒకే గనిలో పెద్ద మొత్తంలో లభించదు. ఇది చిన్నచిన్న ఖనిజాల రూపంలో చెల్లాచెదురుగా దొరుకుతుంది. ఒక పెద్ద రాయిలో కూడా కొన్ని గ్రాముల బంగారం మాత్రమే దొరుకుతుంది.

 Indian Economy6/8

బంగారు నిల్వలు

భారతదేశంలో మొత్తం అంచనా బంగారు నిల్వలు సుమారు 879.58 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఎక్కువ భాగం కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. 

Karnataka Gold7/8

దేశంలోనే అతిపెద్ద బంగారు ఉత్పత్తి

కర్ణాటక దేశంలోనే అతిపెద్ద బంగారు ఉత్పత్తి రాష్ట్రంగా నిలుస్తోంది. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో కూడా భారీ స్థాయిలో బంగారు నిల్వలు గుర్తించారు.

Rajasthan gold mine8/8

కేవలం 2-3 టన్నుల బంగారం

దేశీయ ఉత్పత్తి పరిమితం కావడంతో భారత్ సంవత్సరానికి కేవలం 2-3 టన్నుల బంగారం మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. అయితే వినియోగం చాలా ఎక్కువగా ఉండటంతో అధిక భాగం బంగారం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగా గుర్తించిన బంగారు గనులు దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పీల్చేలా మారవచ్చు.