Gold-Silver Price Fall Today: భారీగా పతనమైన బంగారం ధర.. తులం లక్షకు పడిపోవడం పక్కా? నవంబర్ 15వ తేదీ శనివారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: బంగారం ధరలు ఒక్కరోజులోనే భారీగా పతనం అయ్యాయి. నేడు నవంబర్ 15వ తేదీ శనివారం బంగారం ధరల్లో అనూహ్యమైన భారీ పతనం నమోదైంది. కేవలం ఒకరోజు వ్యవధిలోనే 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ. 4,000 వరకు తగ్గిపోవడం మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది. 

1 /6

నవంబర్ 15 నాటి తాజా రేట్ల ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,26,180, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,17,600 వద్దకు చేరింది. వెండి ధర కూడా ప్రభావితం కాగా, ప్రస్తుతం ఒక కిలో వెండి మార్కెట్‌లో రూ. 1,58,000 వద్ద లభిస్తోంది. ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు హఠాత్తుగా క్షీణించడం పెట్టుబడిదారులకు ఊహించని పరిణామంగా మారింది.  

2 /6

బంగారం ధరల ఈ పతనానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న తాజా ఆర్థిక మార్పులేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లపై తీసుకోబోయే నిర్ణయాల్లో అనిశ్చితి పెరగడం మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. 

3 /6

ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్‌లో వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు 49శాతం వరకు పడిపోవడంతో, వడ్డీరేట్లలో మార్పు ఉండదన్న అభిప్రాయం బలపడింది. వడ్డీరేట్లు తగ్గకపోతే, అమెరికా ట్రెజరీ బాండ్లపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతుంది. దీంతో బంగారం వంటి సేఫ్ హావెన్ ఆస్తులపై డిమాండ్ తగ్గడం సహజం. ఈ ప్రభావం ధరల్లో ప్రతిఫలించిందని నిపుణులు చెబుతున్నారు.

4 /6

అదే సమయంలో, డాలర్ బలపడి ఇతర కరెన్సీలపై ఒత్తిడి పెంచడం కూడా బంగారం ధరలు తగ్గడానికి కారణమైంది. కొద్ది రోజుల క్రితం అమెరికా మార్కెట్‌లో బంగారం ఔన్స్ ధర $4,200 వద్దకు చేరి రికార్డు సృష్టించింది. అయితే అక్కడి నుంచి వేగంగా పడుతూ $4,050కి దిగివచ్చింది. అంతర్జాతీయంగా తగ్గిన ఈ ట్రెండ్ భారత మార్కెట్‌ను కూడా ప్రభావితం చేసింది. బంగారం కొనుగోలు చేయదలచిన వినియోగదారులకు ఈ ధర పతనం ఒక మంచి అవకాశం అని చెప్పాలి.  

5 /6

ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు బంగారం ధరలు దాదాపు 50శాతం వరకు పెరిగాయి. కానీ ప్రస్తుతం కనిపిస్తున్న ఈ పెద్ద పతనం  స్వల్పకాలిక సవరణ మాత్రమేనని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వెండి కూడా ఇదే తరహాలో తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు రికార్డు గరిష్ఠ స్థాయిల నుంచి క్రమంగా పడిపోవడం వల్ల, దేశీయ మార్కెట్ కూడా తగ్గుదల దిశగా కదులుతోంది.

6 /6

మొత్తం మీద, బంగారం, వెండి ధరల తాజా పడిపోవడం వినియోగదారులకు ఉపశమనం కలిగించినప్పటికీ, మార్కెట్‌లోని అస్థిరత పెట్టుబడిదారులను కొంత ఆలోచనలో పడేస్తోంది.Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.