Add Zee Business As A Preferred Source
App

Gold Mine: దేశంలో బయటపడ్డ మరో బంగారు గని.. కుప్పలు తెప్పలుగా పసిడి నిల్వలు.. ఎక్కడంటే..!

Written ByAruna Maharaju
Published: Oct 23, 2025, 06:12 PM IST|Updated: Oct 23, 2025, 06:30 PM IST

Gold Mine In India: బంగారం ధరలు రోజురోజుకి ఆకాశాన్నంటుతున్నవేళ.. దేశంలో మరో కొత్త బంగారు గని బయటపడింది. భారత్‌లో బంగారు గనులు అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు.. కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. అయితే ఇప్పుడు కర్ణాటకని అధిగమించి.. రాజస్థాన్ రాష్ట్రం పేరు మారుమ్రోగుతోంది. ఇప్పటికే రాజస్థాన్‌లో రెండు బంగారు గనులు ఉండగా.. తాజాగా మరో బంగారు గనిని గుర్తించారు. 
 

Rajasthan Gold Mine1/5

భారత్‌లో బయటపడ్డ మరో బంగారు గని

రాజస్థాన్‌లోని బాన్స్‌వాడ జిల్లాలో మూడవ బంగారు గనిని భూగర్భ శాస్త్రవేత్తలు  గుర్తించారు. ఈ గనిలో 3 చ.కి.మీ విస్తీర్ణంలో బంగారు ఖనిజ నిల్వలు ఉన్నాయన్నారు. తాజాగా కనుగొనబడిన ఈ గనితో భారతదేశంలో బంగారం ఉత్పత్తిలో.. రాజస్థాన్ వాటా మరో 25 శాతంకు పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  

Gold Mine In India2/5

రాజస్థాన్‌లో బయటపడ్డ బంగారు గని

రాజస్థాన్ రాష్ట్రంలో ఇప్పటికే రెండు గనులు ఉన్నాయి. ఇక తాజాగా బాన్స్‌వాడ జిల్లాలోని ఘటోల్-కంకారియా గ్రామంలో.. మూడవ బంగారు గనిని భూగర్బ శాస్త్రవేత్తలు గుర్తించారు. మైనింగ్ లైసెన్స్ జారీ అయిన వెంటనే.. ఖనిజం వెలికితీత పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేపట్టనున్నారు.   

Gold Mine In Rajasthan3/5

భారత్‌లో బయటపడ్డ మరో బంగారు గని

అయితే 940.26 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న మొత్తం ప్రాంతంలో.. 113.52 మిలియన్ టన్నులు బంగారు ఖనిజం ఉండవచ్చని భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 

Gold Mine4/5

రాజస్థాన్‌లో బయటపడ్డ బంగారు గని

ఈ ఖనిజంను ప్రాసెస్ చేస్తే మొత్తం 222.39 టన్నుల బంగారు లోహం లభించవచ్చని.. కంకారియా-గారా ప్రాంతంలో 205 హెక్టార్లలో 1.24 మిలియన్ టన్నుల బంగారు ఖనిజం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.

Gold Reserves In Rajasthan5/5

బంగారు గని

ఈ గనిలో గోల్డ్‌తో పాటు అనేక ఇతర సహ ఖనిజాలు కూడా వెలికితీసేందుకు.. శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా కనుగొనబడిన ఈ గనితో దేశంలో బంగారం ఉత్పత్తిలో రాజస్థాన్ వాటా మరో 25 శాతంకు పెరగనుందని నిపుణులు చెబుతున్నారు.