AP DSC 2025 Teachers Recruitment : ఏపీలోని డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్. ఈ నెలలోనే ఉపాధ్యాయుల నియామకాలను పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రభుత్వం కలిసి పనిచేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ విద్యలో ప్రపంచ నమూనాగా ఎదుగుతుందని మంత్రి నారాలోకేశ్ అన్నారు.
1/7AP DSC 2025 Teachers Recruitment : ఏపీలోని డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త వినిపించారు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారాలోకేష్. లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు ఇది నిజంగా శుభవార్తే అని చెప్పవచ్చు. ఒక దేశం లేదా రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని లోకేష్ అన్నారు.
2/7ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర విద్యా వ్యవస్థలో వస్తున్న సానుకూల మార్పులను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని చెప్పవచ్చు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల నమ్మకం తిరిగి పెరుగుతోందని ఆయన అన్నారు. ప్రస్తుతం అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారని, ఉపాధ్యాయుల నియామకాలు పూర్తవగానే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత మరింత మెరుగవుతుందని తెలిపారు.
3/7లోకేశ్ మాట్లాడుతూ.. విద్యారంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రాబోయే రోజుల్లో అనేక కొత్త సంస్కరణలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తాను విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించిన సమయంలో కొంతమంది అనుమానాలు వ్యక్తం చేసినా, వాటిని ఛాలెంజ్‌గా తీసుకొని విజయవంతంగా ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు.
4/7విజయవాడలో జరిగిన గురుపూజోత్సవ వేడుకలో లోకేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల ప్రాముఖ్యతను గుర్తు చేశారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులలో దాదాపు 80 శాతం మంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన డీఎస్సీల ద్వారా ఎంపికయ్యారని గుర్తుచేశారు.
5/7ఇప్పటి వరకు 13 డీఎస్సీల ద్వారా సుమారు 1.80 లక్షల మంది టీచర్లను నియమించామని, మెగా డీఎస్సీ ఫైల్‌పై మొదటి సంతకం కూడా చంద్రబాబే చేశారని తెలిపారు. డీఎస్సీ నిర్వహించడం ఎంతటి సవాల్ అయినా, సీఎం మార్గదర్శకత్వంలో విజయవంతంగా పూర్తి చేసామని అన్నారు. 70కి పైగా కేసులు ఎదురైనా, డీఎస్సీ ఆగలేదని లోకేశ్ స్పష్టం చేశారు.
6/7అంతకుముందు, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. ఉపాధ్యాయులు సమాజ భవిష్యత్ రూపుదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తారని లోకేశ్ కొనియాడారు.
7/7విద్యారంగంలో రాబోయే మార్పులు ప్రభుత్వ పాఠశాలలకు కొత్త ఊపునిచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నాణ్యమైన బోధన, సమర్థవంతమైన ఉపాధ్యాయ నియామకాలు, సదుపాయాల మెరుగుదలతో ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ దేశంలోనే ఒక మోడల్‌గా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.