Add Zee Business As A Preferred Source
App

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బిహార్ ఎన్నికల ముందే 8వ వేతన సంఘం..!

Written ByTA Kiran Kumar
Published: Sep 27, 2025, 02:39 PM IST|Updated: Sep 27, 2025, 02:41 PM IST

8th Pay Commission Big Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొన్నేళ్లుగా 8వ వేతన సంఘం ఎప్పటి నుంచి అమలువుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. బిహార్ ఎన్నికల కంటే ముందే 8వ వేతన సంఘం ఏర్పాటుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 

8th Pay Commission Big Update1/6

8th పే కమిషన్

8th Pay Commission Big Update: కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ప్రకటించి తొమ్మిది నెలలు కావొస్తోంది. కానీ ఇప్పటి వరకు దీనిపై పెద్ద అప్ డేట్ మాత్రం రాలేదు. రేపు, మాపు అంటూ  కాలం వెళ్లదీస్తున్నారు. ఇక 8వ వేతన సంఘం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి దాదాపు కోటీ మంది పైగా ఎదురు చూస్తున్నారు.  కేంద్ర ప్రభుత్వం ఈ యేడాది జనవరిలో కొత్త వేతన సంఘాన్ని ఆమోదించింది. కొత్త వేతన సంఘం 2026 జనవరిలో అమలు చేయబడుతుందని మొదట్లో అందరు ఊహించారు. దీనిపై ఇంకా ఓ కమిటీ ఏర్పాటు కాలేదు. 

New Pay Commission 2/6

కొత్త వేతన బకాయిలు

దీని ప్రకారం జనవరి 2026 నాటికి కొత్త వేతన సంఘం అమలు చేస్తారా లేదా అనేది చూడాలి. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చినా, ఉద్యోగులు,  పెన్షనర్లు జనవరి 2026 నుండి కొత్త వేతన బకాయిలు పొందుతారనేది స్పష్టమైంది. వచ్చే నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నగార మోగనుంది.  కీలకమైన ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం  8వ వేతన సంఘంతో ప్రభుత్వ ఉద్యోగులకు బహుమతి ఇవ్వబోతున్నట్టు చెబుతున్నారు.

Bihar Assembly Elections 3/6

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే కేంద్ర ప్రభుత్వం కొత్త వేతన సంఘం పై  ఒక కమిటీని ప్రకటించవచ్చు. కమిటీ ఏర్పడిన తర్వాత, దాని నివేదికను సిద్ధం చేయడానికి దాదాపు యేడాది పైగా సమయం పట్టవచ్చు. మరోవైపు ఈ కమిటీ నివేదికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆ తర్వాత ప్రభుత్వం దీన్ని ఆమోదించడమే ఆలస్యం. అంటే బీహార్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఎన్నికలకు ముందు ప్రభుత్వం శుభవార్త చెప్పడం గ్యారంటీ అని చెబుతున్నారు. 

8th Pay Commission 4/6

8వ వేతన సంఘం

8వ వేతన సంఘం అమలుకు ముందే, కేంద్ర ఉద్యోగుల మనస్సుల్లో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వేతన పెంపులో కీలకమైన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 1.92 మరియు 3.0 మధ్య నిర్ణయించాలని భావిస్తున్నారు.ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 నుండి 2.89కి పెరగవచ్చని చాలా మంది ఆర్థికవేత్తలు సూచించారు. అలా జరిగితే, ప్రస్తుతం రూ. 18,000 పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనం ఏకంగా  రూ. 52,020కి పెరుగుతుంది.

Central Govt Employess 5/6

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా, పెన్షనర్లకు కూడా గణనీయమైన పెరుగుదల లభిస్తుంది. ఇది వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. 

Disclaimer6/6

గమనిక

గమనిక.. ఈ సమాచారం ప్రభుత్వ ఉద్యోగుల  ప్రయోజనాల కోసం మాత్రమే వ్రాయబడింది. 8వ వేతన సంఘం కింద అందుబాటులో ఉన్న జీతాల పెంపు లేదా పెన్షన్ పెంపు గురించి ఎటువంటి హామీని మేము ఇక్కడ ప్రస్తావించలేదు. ప్రభుత్వ వర్గాల్లోని సోర్సెస్ ద్వారా మేము ఈ సమాచారం అందించాము.  ఖచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సంప్రదించవచ్చు.