Pensioners Update: కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షనర్లకు బిగ్ అప్‌డేట్ ఇది. ఇప్పటి వరకు 80 ఏళ్లు దాటితే లభించే అదనపు పెన్షన్ ప్రయోజనాన్ని ఇకపై 65 ఏళ్లకే అందించాలని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. ఈ సిఫార్సులు ఆమోదం పొందితే లక్షలాది పెన్షనర్లకు లాభం కలగనుంది.
కేంద్ర ప్రభుత్వంపై ఈ అంశంపై ఒత్తిడి పెరుగుతుండటంతో ఈ అదనపు పెన్షన్ విధానం అమలయ్యే పరిస్థితి కన్పిస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.
పెన్షనర్లకు వయస్సు పెరిగే కొద్దీ ఆర్ధిక సహాయం అందేలా ఈ పధకాన్ని సమీక్షించాలని కమిటీ ప్రభుత్వాన్ని కోరింది.
65 ఏళ్ల వయస్సు ఉంటే 5 శాతం అదనపు పెన్షన్, 70 ఏళ్ల వయస్సంటే 10 శాతం, 75 ఏళ్లుంటే 15 శాతం, 80 ఏళ్లుంటే 20 శాతం అదనపు పెన్షన్ లభిస్తుంది.
65 ఏళ్లు దాటితే అదనపు పెన్షన్ అందించాలనే పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు ఆమోదం పొందితే సీనియర్ సిటిజన్లకు పెన్షన్ ఇలా ఉంటుంది.
ప్రస్తుతం 80 ఏళ్ల తరువాతే అదనపు పెన్షన్ 20 శాతం లభిస్తోంది. ఇది వయస్సుతో పాటు పెరుగుతుంటుంది. కానీ కొత్త పధకం ప్రకారం 65 ఏళ్లకే అదనపు పెన్షన్ లభిస్తుంది.
సీనియర్ సిటిజన్లకు వయస్సు పెరిగే కొద్దీ వైద్యంతో పాటు ఇతర అవసరాలకు డబ్బు అవసరమౌతుంటుంది. ఈ పరిస్థితుల్లో వృద్ధులకు ఆర్ధిక భద్రత అందించేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది.