Add Zee Business As A Preferred Source
App

Google: దీపావళికి గూగుల్ ప్రత్యేక ఆఫర్‌.. కేవలం రూ.11కే 2TB స్టోరేజ్‌ ప్లాన్‌..!

Written ByRenuka Godugu
Published: Oct 17, 2025, 10:21 AM IST|Updated: Oct 17, 2025, 10:22 AM IST

Google Diwali Offer: గూగుల్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. దీపావళి సందర్భంగా గూగుల్‌ వన్‌ క్లౌడ్‌ స్టోరేజీ బిగ్‌ డిస్కౌంట్‌ ప్రకటించింది. ఇది కొత్త, పాత యూజర్‌లకు కూడా వర్తిస్తుంది. ఈ ప్లాన్‌లో గూగుల్‌ లైట్‌, బేసిక్‌, స్టాండర్డ్‌, ప్రీమియం ప్లాన్స్‌ కొనుగోలు చేయవచ్చు. దీపావళి సందర్భంగా గూగుల్‌ అందిస్తున్న స్టోరేజీ బంపర్‌ ప్లాన్‌ వివరాలు తెలుసుకుందాం.
 

Bumper Plan1/5

బంపర్‌ ప్లాన్‌

గూగుల్‌ బంపర్‌ ప్లాన్‌ కేవలం రూ.11 కే బంపర్‌ ప్లాన్ ప్రకటించింది. గూగుల్‌ క్లౌడ్ స్టోరేజీ ప్లాన్‌ దీపావళి సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటిస్తోంది. ఇది గూగుల్‌ వన్ ప్లాన్స్‌ అన్నిటికీ వర్తిస్తుంది.  

TB2/5

టీబీ

30 జీబీ నుంచి 2 టీబీ గూగుల్‌ వన్‌ స్టోరేజీ ప్లాన్స్‌పై వర్తిస్తుంది. సాధారణంగా ఈ ప్లాన్‌ ధర నెలకుయ రూ.30. దీని ధర ప్రస్తుతం దీపావళి సందర్భంగా కేవలం రూ.11 కే పొందవచ్చు.  

Basic3/5

బేసిక్‌

అదేవిధంగా ఈ ప్లాన్‌లో బేసిక్‌, స్టాండర్డ్‌ ప్లాన్స్‌ ధరలు కూడా రూ.130, రూ.210 ప్రతి నెలకు పొందవచ్చు. ఈ ప్లాన్స్‌ కూడా రూ.11 కే అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీరు 100 జీబీ, 200 జీబీ స్టోరేజీ పొందుతారు.  

Google One4/5

గూగుల్ వన్‌

గూగుల్ వన్‌ ప్రీమియం ప్లాన్‌ 2 టీబీ స్టోరేజీ పల్ఆన్‌ ధర కూడా కేవలం రూ.11 చెల్లించాలి. దీపావళి ఆఫర్ తర్వాత రూ.650 ప్రతినెలకు వర్తిస్తుంది.ఈ గూగుల్‌ వన్‌ స్టోరేజ్‌ ఆఫర్‌ అక్టోబర్‌ 31వ తేదీ వరకు వర్తిస్తుంది.  

Google5/5

గూగుల్‌

ఉదాహరణకు గూగుల్‌ వన్‌ లైట్‌ ధర రూ.708 ఏడాదికి వర్తిస్తే ప్రస్తుతం దాని ధర రూ. 479 ప్లాన్‌. అదేవిధంగా రూ.1560 ప్లాన్‌ ధర రూ.1000 తగ్గించారు. ఏడాది ప్లాన్‌ రూ.2520 నుంచి రూ.1600 కు తగ్గించారు. 100 జీబీ స్టోరేజీ బేసిక్‌ ప్లాన్‌ 200 జీబీ జీమెయిల్‌, ఫోటోస్, డ్రైవ్‌ స్టోరేజ్‌ లభిస్తుంది.