Graduate Girls: గ్రాడ్యుయేట్ విద్యార్ధినులకు భారీ ప్రోత్సాహకం, విద్యార్ధినుల ఖాతాల్లో నేరుగా 25 వేల రూపాయలు, ఎలాగంటే
అర్ఙులైన విద్యార్ధినులు 2018 ఏప్రిల్ 25 తరువాత గ్యాడ్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు నింపేటప్పుడు అవసరమైన పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, అడ్రస్ ఐడీ తప్పకుండా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం అందించే 25 వేల రూపాయల నగదు నేరుగా విద్యార్ధినుల ఖాతాలో జమ అవుతుంది. దీనికోసం విద్యార్ధినులు రిజిస్ట్రేషన్ చేయించుకోవల్సి ఉంటుంది. దీనికోసం www.edudbt.bih.nic.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఇక్కడ Link 1 For student registration and login onlyపై క్లిక్ చేసి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్ధినులు చదువు వైపు ఆకర్షితులయ్యేలా చేయడమే ఈ పధకం ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకం నిబంధనల ప్రకారం ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు, యూనివర్సిటీల్లో చదివే విద్యార్ధినులకు ఈ నగదు అందుతుంది.
ముఖ్యంగా బీహార్ ప్రభుత్వం అమ్మాయిల కోసం బాలికా స్నాతక ప్రోత్సాహ పధకం అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా గ్యాడ్యుయేషన్ చేసే విద్యార్ధినులకు 25 వేల రూపాయలు అందుతాయి.
విద్యార్ధినుల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గ్రాడ్యుయేట్ విద్యార్ధినులకు 25 వేల రూపాయలు ప్రకటించింది. మీ అమ్మాయిలకు ఆ సౌకర్యం ఎలా వర్తిస్తుందనేది ఇప్పుడు పరిశీలిద్దాం