Govt Loan: అతి తక్కువ వడ్డీ రేటుకే కేంద్ర ప్రభుత్వం అందించే రూ.10 లక్షల లోన్ కావాలా? ఉండాల్సిన అర్హతలు ఇవే..!!

Suvidha Loan Scheme: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన జాతీయ షెడ్యూల్డ్ కాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSFDC) షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన వర్గాలకు ఆర్థిక సహాయం అందించేందుకు స్థాపించారు. NSFDC ద్వారా ఎస్సీ వర్గానికి చెందిన పేద కుటుంబాలకు తక్కువ వడ్డీరేట్లతో రుణాలు అందిస్తున్నారు.

1 /5

ముఖ్యంగా ఈ రుణాల ద్వారా షెడ్యూల్డ్ కులాలకు చెందిన యువతీ యువకులు ఉపాధి పొందడంతో పాటు చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి వృత్తి శిక్షణ పొందడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. NSFDC అనేక రకాల రుణాలను అందిస్తున్నప్పటికీ అందులో ప్రధానంగా సువిధా లోన్ లోన్ కింద గరిష్టంగా 10 లక్షల వరకు రుణాలను అందిస్తోంది.   

2 /5

ఈ రుణాలపై అత్యల్పంగా కేవలం ఎనిమిది శాతం మాత్రమే వడ్డీ రేటు ఆకర్షిస్తుంది. సువిధా లోన్ ఈ స్కీం ద్వారా సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన షెడ్యూలు కులాలు తెగలకు చెందిన వారు కార్పొరేషన్ అందించే రుణాలతో సొంత వ్యాపారాన్ని ప్రారంభించుకునే అవకాశం ఉంది.   

3 /5

ఈ స్కీం కింద మొత్తం 10 లక్షల  రూపాయల వరకు రుణాలను అందించనున్నారు. అయితే ప్రాజెక్టు వేయడంలో 90% వరకు మీకు రుణం లభిస్తుంది మిగతా పది శాతం మీరు ఏర్పాటు చేసుకోవాలి. అంటే 10 లక్షల ప్రాజెక్టు వేయానికి గాను 9 లక్షల రూపాయల రుణం లభిస్తుంది. ఈ రుణంపై 8 శాతం వడ్డీ అందుబాటులో ఉంది.   

4 /5

ఈ లోన్ పొందిన తర్వాత గరిష్టంగా ఐదు సంవత్సరాలు  చెల్లించాల్సి ఉంటుంది. మొదటి ఆరు నెలల పాటు మారిటోరియం ఉంటుంది. అంటే మీరు వాయిదాలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ స్కీం లో ప్రతి మూడు నెలలకు ఒకసారి కానీ ఆరు నెలలకు ఒకసారి కానీ వాయిదాలు చెల్లించవచ్చు.   

5 /5

ఈ స్కీంకు సంబంధించిన అంతవరకు అర్హతల విషయానికి వచ్చినట్లయితే, లబ్ధిదారుడు షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. అలాగే వారి సంవత్సర ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి. ఈ స్కీంను రాష్ట్ర స్థాయి ఛానలైజింగ్ ఏజెన్సీలు (SCAs) ద్వారా అమలు చేస్తారు. పూర్తి వివరాల కోసం https://www.nsfdc.nic.in/ వెబ్ సైట్ విజిట్ చేయాల్సి ఉంది