Govt Employees Bumper Bonanza DA Hike Up To 252 Percent: వరుస పండుగల నేపథ్యంలో ఉద్యోగులకు ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలు అందుతుంటాయి. ఈ క్రమంలోనే ఓ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 252 శాతం డీఏ పెరుగుదల రానుంది. దీంతో ఉద్యోగులకు బంపర్ బొనాంజా తగిలింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
1/6ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే ఆర్థిక ప్రయోజనాల్లో ఒకటి కరువు భత్యం (డీఏ). సాధారణంగా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు డీఏను పెండింగ్‌లో ఉంచాయి. ఒకటి లేదా రెండు చొప్పున పెండింగ్‌లో ఉండగా.. తెలంగాణ, ఏపీలు మాత్రం పెండింగ్ డీఏల్లో రికార్డు సృష్టిస్తున్నాయి. అయితే పంజాబ్, హర్యానాలో మాత్రం భారీగా డీఏ విడుదల చేశారు.
2/6హైకోర్టు ఆదేశాల మేరకు హర్యానా ప్రభుత్వం ఉద్యోగులకు 252 శాతం డీఏను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల జీతాలను పెంచాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 14,000 మంది ఉద్యోగులకు మూడు విడతలుగా డీఏ విడుదల చేయనుంది. ఈ మేరకు రూ.600 కోట్లు విడుదల చేస్తున్నట్లు సమాచారం.
3/6పంజాబ్-హర్యానా హైకోర్టు ఆదేశాల ఆధారంగా హర్యానా ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల జీతాలను పెంచాలని నిర్ణయించడంతో.. దాదాపు 14 వేల మంది ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం లభించనుంది. ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి.
4/6ఎన్‌హెచ్‌ఎం హర్యానా మిషన్ డైరెక్టర్ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) మూడు దశల్లో పెంపుదల లభించనుంది. 1 జనవరి 2024 నుంచి DA 230 శాతం నుంచి 239 శాతంకి, 1 జూలై 2024 నుంచి 239 శాతం నుంచి 246 శాతానికి, 1 జనవరి 2025 నుంచి 246 శాతం నుంచి 252 శాతానికి డీఏ పెరుగుతుంది.
5/6న్యాయస్థానం ఆదేశాలతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు భారీగా ఆర్థిక ప్రయోజనం లభించనుంది. హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన ఉద్యోగులు తమకు అనుకూలంగా తీర్పు తెచ్చుకోవడంతో సంబరాల్లో మునిగారు.
6/6మూడు దశల్లో (2024-2025) 230 శాతం నుంచి 252 శాతం డీఏ పెంపు వస్తుండడంతో ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సుదీర్ఘ పోరాటం తర్వాత తమకు న్యాయం జరగడంపై ఆనందంలో ఉన్నారు. ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని ఆర్థిక రక్షణగా మరియు "సుదీర్ఘ పోరాటానికి ప్రతిఫలంగా" భావిస్తున్నారు.