Add Zee Business As A Preferred Source
App

Telangana Govt Jobs: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. ఏకంగా 1,743 పోస్టులకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి డిటెయిల్స్..

Written ByInamdar Paresh
Published: Sep 17, 2025, 05:03 PM IST|Updated: Sep 18, 2025, 07:55 AM IST

Tgsrtc Announces 1743 Vacancies: తెలంగాణలో నిరుద్యోగ అభ్యర్థులకు రేవంత్ సర్కారు దసరా పండగ కంటే ముందు భారీ శుభవార్త చెప్పింది. ఆర్టీసీలో 1743 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Telangana jobs:1/6

రేవంత్ రెడ్డి ప్రభుత్వం:

తెలంగాణలో గత కొన్నిరోజులుగా నిరుద్యోగ అభ్యర్థులు సర్కారు కొలువు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో గ్రూప్స్ ఎగ్జామ్ తర్వాత చాలా నెలల పాటు ఎలాంటి నోటిఫికేషన్ లు లేక అభ్యర్థులు ఇంకా ప్రిపరేషన్ లోనే ఉన్నారు.  

cm revanth reddy:2/6

ఆర్టీసీలో ఉద్యోగాలు:

చాలా మంది సర్కారు కొలువు సాధించాలని ఎంతో ఆశతో ఉంటారు. చిక్కడపల్లిలొ ఉన్న సెంట్రల్ లైబ్రరీ, అశోక్ నగర్ , దిల్ సుఖ్ నగర్ లలో కోచింగ్ సెంటర్ లలో కోచింగ్ లు తీసుకుంటూ, రీడింగ్ రూమ్ లలో ప్రిపేర్ అవుతుంటారు.

tgsrtc jobs:3/6

తెలంగాణ ఆర్టీసీలో కొలువులు:

ఈ క్రమంలో రేవంత్ సర్కారు ఎన్నికల సమయంలో భారీగా గవర్నమెంట్ జాబ్ లకు నోటిఫికేషన్ లు ఇచ్చి విద్యార్థులకు న్యాయం చేస్తామనిచెప్పారు.ఈ క్రమంలో నోటిఫికేషన్ లు ఇవ్వడంతో పాటు, న్యాయపరంగా చిక్కులు రాకుండా ముందుకు వెళ్తున్నారు.   

jobs news:4/6

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు:

ఈ క్రమంలో తాజాగా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఆర్టీసీలో భారీగా కొలువులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏకంగా 1,743 పోస్టులకు రిక్రూట్ మెంట్ బోర్డుతో నియామకం చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.

rtc md sajjanar:5/6

రేవంత్ రెడ్డి:

టీజీఎస్సార్టీసీ నోటిఫికేషన్ ప్రకారం.. 1,743 పోస్టులలో..100 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పోస్టులను.. తెలంగాణ పోలీస్ నియామక మండలితో రిక్రూట్ మెంట్ తో రిటర్న్ ఎగ్జామ్, మెరిట్ ఆధారంగా భర్తీ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.   

Jobs in telangana rtc:6/6

తెలంగాణ జాబ్స్:

అభ్యర్థులు అక్టోబర్ 8 నుంచి 28 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటుందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.  ఏజ్ 22 నుంచి 35 ఏళ్లుగా నిర్ణయించారు. పే స్కేల్.. రూ. 20,960 నుంచి 60,080 గా ఉంటుందని అధికారులు తెలిపారు.   పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని కోరారు. అదే విధంగా ఉద్యోగాలపై ఎలాంటి పుకార్లనుకూడా నమ్మోద్దని ఆర్టీసీఎండీ సజ్జనార్  స్పష్టం చేశారు.