Govt Teachers Promotions With Salary: సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) నుంచి స్కూల్ అసిస్టెంట్ (SA) వరకు ప్రమోషన్స్ పొందాలంటే.. ఉపాధ్యాయులకు కొంత అనుభవంతోపాటు అర్హతలు కూడా సాధించాల్సి ఉంటుంది. SGT కొన్ని సంవత్సరాల అనుభవంతోపాటు TET పరీక్షలో ఉత్తీర్ణత, ఇంకా కొన్ని నిర్దిష్ట అర్హతలు సాధించాల్సి ఉంటుంది. ఎలాంటి సందర్భాల్లో ప్రమోషన్ ఉంటుంది..? పే స్కేల్ ఎంత ఉంటుంది..? ఇక్కడ తెలుసుకుందాం..
మొదటి సందర్భంలో కింది క్యాడర్‌లో ఆర్డినరీ లేదా 6 ఇయర్స్ కంప్లీట్ చేసి ప్రమోషన్ పొంది ఉంటే.. వీరికి డైరెక్ట్‌గా SA SCALE OF PAY లో పెట్టి ఫిక్సషన్ చేస్తారు. బేసిక్: రూ.44,570, స్కేల్: 44570-1,27,480
SGT గా 6/12/18 పూర్తి చేసుకుని ప్రమోషన్ పొందిన సందర్భం: ఇప్పటికే SA స్కేల్ పొంది ఉన్నారు కాబట్టి HM SCALE OF PAY లో పెట్టును. బేసిక్: 54,060, స్కేల్ ఆఫ్ పే: 54,060-1,40,540
24 ఇయర్స్ స్కేల్ తీసుకుని ప్రమోషన్ పొందన సందర్భం: FR 22 a1 ప్రకారం ఒక ఇంక్రిమెంట్ మాత్రమే వస్తుంది.. 6/12/18/24 ఇంక్రిమెంట్స్ రావు.
కానీ 24 ఇయర్స్ కంప్లీట్ చేసి 24 ఇయర్స్ స్కేల్ తీసుకోకుండా ప్రమోషన్ పొంది ఉంటే.. ==> CASE 1: ప్రమోషన్ డేట్‌కి ఆప్షన్ ఇచ్చి ఉంటే.. FR 22B ప్రకారం రెండు ఇంక్రిమెంట్స్ ఇస్తారు. AGI మాత్రం 12 నెలలకు వస్తుంది. 6/12/18/24 ఇంక్రిమెంట్ వస్తుంది.
==> CASE 2: ఇంక్రిమెంట్ తేదీకి ఆప్షన్ ఇస్తే.. FR 22 a1 ప్రకారం ఒక ఇంక్రిమెంట్, FR 22B ప్రకారం రెండు ఇంక్రిమెంట్స్ ఇస్తారు. 6/12/18/24 ఇంక్రిమెంట్ వస్తుంది. ప్రమోషన్ ఫిక్సషన్ ఆప్షన్స్ రెండు రకాలు.. 1.INCREAMENT DATE 2.PROMOTION DATE.. ఏది లాభదాయకం అనుకుంటే.. అది ఫిక్స్ చేసుకోవాలి.