List Of Items Get Cheaper: GST ధరలు తగ్గడంతో సామాన్యులకు దసరా ధమాకా మొదలైంది. నేటి నుంచే నిత్యవసర వస్తువుల ధరలు కూడా తగ్గడంతో పండగ చేసుకునే వాతావనం ఏర్పడింది. ప్రధానంగా ఈ GST ధర తగ్గడంతో ఏ వస్తువులపై ఎంత ధర తగ్గుతుంది? ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
1/5జీఎస్టీ ధరలు తగ్గడంతో ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, కార్లు, బైకులతో పాటు నిత్యవసర వస్తువులైన చీప్స్, పాలు, బిస్కట్స్ వంటిపై కూడా ధరలు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ఒక్క వస్తువుపై ఎంత మేర ధరలు తగ్గి ఉండవచ్చు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
2/5ఏసీ ధరలు రూ.2800 నుంచి రూ.5900 వరకు స్ప్లిట్ ఏసీ ధరలు తగ్గాయి. ఇక విండో ఏసీ విషయానికొస్తే రూ.3400 వరకు కమర్షియల్ సిస్టం ధరలు తగ్గాయి. ఇవి పెద్ద మొత్తంలో ఆఫీసుల్లో వినియోగిస్తారు.
3/5డిష్ వాషర్ల విషయానికి వస్తే రూ.8000 వరకు ధరలు తగ్గాయి. అయితే ఎంట్రీ లెవెల్ మోడల్ బట్టి రూ.4000 వరకు దాదాపు ఈ డిష్ వాషర్లపై ధర తగ్గింది. ఈ మధ్యకాలంలో డిష్ వాషర్ల కొనుగోలుదారులు కూడా పెరుగుతున్నారు. ఈ ధర తగ్గడంతో వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
4/5ఇక టీవీల విషయానికొస్తే 32 ఇంచుల టీవీ రూ. 2600 నుంచి రూ.85 వేల వరకు ఆ స్క్రీన్ సైజును బట్టి తగ్గాయి. ఇక 43 ఇంచుల టీవీ రూ. 2000 నుంచి రూ.5000 వరకు.. 65 ఇంచుల టీవీ రూ.3400 నుంచి రూ.20వేల వరకు ధరలు తగ్గించారు. 100 ఇంచుల టీవీల విషయానికి వస్తే రూ.85000 వరకు తగ్గించారు.
5/5వీటితోపాటు బాత్రూం ఎసెన్షియల్స్ అయిన షాంపూలు, సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్ లో కూడా 5% జీఎస్‌టీ తగ్గించారు. క్రీములు, పౌడర్లు కూడా ఐదు శాతం వరకు తగ్గాయి. డైపర్స్ కూడా మరింత ధర తగ్గింది.