Health Tips
మన ఇళ్ల దగ్గర తేలికగా దొరికే జామ చెట్టు ఆకు చిన్నదిగా కనిపించినా.. ఆరోగ్యానికి మాత్రం మహాభాగ్యం. పూర్వకాలం నుండి ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికి కూడా.. జామ ఆకు అనేక సమస్యలకు సహజమైన మందుగా పనిచేస్తుంది.
1/6బరువు తగ్గాలని కోరుకునే వారికి జామ ఆకు.. ఇంతకాలం సహాయం చేస్తుంది. ఈ ఆకు రసం.. తాగితే శరీరంలో మెటాబాలిజం పెరుగుతుంది. కొవ్వు పేరుకోకుండా నియంత్రిస్తుంది. రాత్రిపూట ఒక గ్లాస్ జామ ఆకు టీ తాగితే క్రమంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
2/6మధుమేహం ఉన్నవారికి కూడా జామ ఆకు చాలా ఉపయోగకరం. ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిని.. నియంత్రిస్తాయి. క్రమం తప్పకుండా జామ ఆకు నీరు తాగితే షుగర్ స్థాయి నియంత్రణలో ఉంటుంది.
3/6జుట్టు రాలిపోవడం, చుండ్రు సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడతాయి. జామ ఆకులను మరిగించి ఆ.. నీటితో తలస్నానం చేస్తే జుట్టు వేర్లు బలపడతాయి. చుండ్రు తగ్గుతుంది. జుట్టు మెరిసేలా మారుతుంది.
4/6చర్మ సమస్యలకూ జామ ఆకు మంచి మందు. ఇందులో ఉండే యాంటీబాక్టీరియల్ గుణాలు మొటిమలు తగ్గించడంలో సహాయపడతాయి. ఆకు పేస్ట్ రాసుకుంటే చర్మం శుభ్రంగా, తాజాగా ఉంటుంది. గాయాలు త్వరగా మానడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
5/6జీర్ణకోశ సమస్యలకు జామ ఆకు ఔషధం లాంటిది. ఆకు ముద్ద కడుపులోని ఇబ్బందులను తొలగిస్తుంది. విరేచనాలు తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్యను కూడా క్రమంగా సరిచేస్తుంది.
6/6మొత్తానికి చిన్నగా కనిపించే జామ ఆకు, అనేక ఆరోగ్య సమస్యలకు సహజ వైద్యంలో పనిచేస్తుంది... ఇంట్లో సులభంగా దొరికే ఈ ఆకు మన శరీరానికి అద్భుత ప్రయోజనాలు ఇస్తుంది. క్రమం తప్పకుండా వాడితే ఆరోగ్యం బాగుంటుంది.