Guru Favourite Zodiac Signs Effect: గృహస్పతి గ్రహానికి అత్యంత ఇష్టమైన రాశులు కొన్ని ఉన్నాయి. వీరు ఎల్లప్పుడు గురుగ్రహం ఎఫెక్ట్ వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి.
Guru Favourite Zodiac Signs Effect Telugu: 12 గ్రహాల్లో అతి కీలకమైన గ్రహం గృహస్పతి.. ఇది దేవతలకు అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటుంది. అందుకే జాతకంలో ఈ గ్రహం శుభస్థానంలో ఉంటే జ్ఞానం, విద్య, సంపద, ఆనందం, సంతోషానికి ఎలాంటి లోటు ఉండదు. అత్యంత శుభగ్రహాలుగా పేర్కొనే వాటిలో ఇది కూడా ఒకటి. అందుకే ఈ గ్రహం సంచారం చేసిన ప్రతిసారి అన్ని రాశుల వారి జీవితాల్లో సానుకూల ప్రభావం మొదలవుతూ ఉంటుంది. అంతేకాకుండా బస్పతి గ్రహం పూర్వభద్రపాద, విశాఖ, పునర్వసు నక్షత్రాలకు కూడా అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు.
అతి త్వరలోనే గృహస్పతి గ్రహ కదలికల్లో మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పుల కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన సానుకూల మార్పులు వస్తాయి.. దీని కారణంగా బృహస్పతి అనుగ్రహం లభించి.. విపరీతమైన ధన లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే బృహస్పతి గ్రహం కొన్ని రాశుల వారికి ఎల్లప్పుడూ సానుకూల ప్రయోజనాల అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రాశులు అంటే బృహస్పతికి ఇష్టం.. ఆ రాశుల వారి ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు.
దేవ గురు బృహస్పతి కొన్ని రాశుల వారిపై ఎల్లప్పుడూ సానుకూల ప్రభావాన్ని చూపుతూ ఉంటాడు. దీనివల్ల ఆ రాశుల వారు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. బృహస్పతి గ్రహానికి అత్యంత ఇష్టమైన రాశుల్లో ధనస్సు రాశి ఒకటి. ఈ రాశి వారికి బృహస్పతి ఎల్లప్పుడూ బోలెడు ప్రయోజనాలను అందిస్తాడు.
ముఖ్యంగా ధనస్సు రాశి వారికి బృహస్పతి అనుగ్రహం ఎల్లప్పుడూ లభించి ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అలాగే కష్టపడి పనులు చేసే మనస్తత్వం ఉన్న ఈ రాశుల వారు ఎల్లప్పుడూ విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా ప్రేమ పరంగా కూడా చిక్కులు తొలగిపోతూ ఉంటాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మీన రాశి వారికి కూడా గృహస్పతి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి వీరు సమాజంలో ఉన్నత స్థాయికి చేరుతారు. అంతేకాకుండా గొప్ప గౌరవాన్ని కూడా పొందగలుగుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీరికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఎలాంటి పనులు చేసిన ఆలోచనలతో ముందుకు వెళ్తారు.
మీన రాశి వారికి అనేక సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు సంబంధిత కేసులు కూడా తొలగిపోతాయి. అలాగే వీరికి ఆర్థికపరమైన నష్టాలు కూడా రాకుండా ఉంటాయి. ఎలాంటి పనులు చేసిన వీరు ఆచి చూచి ముందడుగు వేస్తారు. అంతేకాకుండా గృహస్పతి అనుగ్రహం వల్ల మోసగాళ్ల నుంచి దూరంగా ఉంటారు.