Guru Gochar 2025: బృహస్పతి అనుగ్రహంతో ఈ రాశుల వారికి అనుకోని అదృష్టం.. సొంత ఇల్లు, వాహన యోగం ..

Guru Gochar 2025: నవ గ్రహాల్లో బృహస్పతి అత్యంత శక్తివంతమైన గ్రహం. గురువు బుద్ధికి జ్ఞానానికి, పిల్లలు, శ్రేయస్సు, సంపదకు కారకుడు. అంతకాదు జాతక చక్రంలో శుక్రుడుతో పాటు గురు స్థానం బలంగా ఉంటేనే వైవాహిక జీవితంలో అడుగుపెడతారు. మే నెలలో బృహస్పతి సంచారము ఏ రాశుల వారికి ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందో చూద్దాం.

1 /8

Guru Gochar 2025: తొమ్మిది గ్రహాలలో గురువు అత్యంత ముఖ్యమైన గ్రహాలలో ఒకటి. అతను మేధో వికాసం, పిల్లలు, సంపద, శ్రేయస్సు మరియు వైవాహిక జీవితాన్ని నిర్ణయించే అంశం. మే 9 తర్వాత బృహస్పతి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీంతో ఏయే రాశుల వారికీ ఎలా ఉండబోతుందో చూద్దాం..

2 /8

2025లో బృహస్పతి సంచారము కొన్ని రాశులకు ప్రత్యేక అదృష్టాన్ని తీసుకురాబోతుంది. ప్రస్తుతం దేవ గురువు బృహస్పతి.. వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు. మే 9 తర్వాత మిథునంలోకి రాబోతుంది.  ఈ సమయంలో కొన్ని రాశుల వారికీ మట్టిని ముట్టుకున్నా.. బంగారం అవుతోంది. 

3 /8

కుంభ రాశి: బృహస్పతి రాశి మార్పు వలన  ఉద్యోగస్థులకు పదోన్నతి, జీతంలో  పెరుగుదల లభించే అవకాశం ఎంతైనా ఉంది. చేసే వృత్తి, వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు.  వైవాహిక జీవితంలో ప్రేమ, అవగాహన పెరుగుతుంది. మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు.

4 /8

సింహ రాశి.. దేవ గురువు బృహస్పతి  వృషభం నుంచి మిథున రాశిలోకి మారడం వలన మిథునం నుంచి మూడో ఇంట్లో ఉన్న సింహ రాశి వారికీ మంచి చేయనున్నాడు.  చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి.  మీరున్న  అన్ని రంగాలలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. పెళ్లికాని వారికి త్వరలో పెళ్లి అవుతోంది.

5 /8

తుల రాశి: దేవ గురువు బృహస్పతి రాశి మార్పు వలన  తుల రాశి వ్యక్తులు అన్ని రంగాలలో గొప్ప విజయాన్ని అందుకుంటారు.  ఆర్థిక లాభాలను అందుకుంటారు. సమాజంలో గొప్ప గౌరవం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కూడా తొలగిపోతాయి. బృహస్పతి సంచారము ఆఫీసులో  ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. జీతం పెంపుదల ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి.

6 /8

మేష రాశి: బృహస్పతి మిథున రాశి సంచారం వలన ఈ రాశి వారికి వృత్తి, వ్యక్తిగత జీవితంలో అనుకోని పురోగతి సాధిస్తారు.  అదృష్టం మీ తలుపు తడుతుంది. అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు చేసే పనికి మీ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో ఆనందం, శాంతి వెల్లివిరుస్తుంది.

7 /8

మిథున రాశి: గురువు రాశి మార్పు వలన  పిల్లల మూలంగా అదృష్టవంతులు అవుతారు. పిల్లల ద్వారా ఆనందం వెల్లివిరుస్తుంది. వివాహానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. చాలా కాలంగా పెండింగూ లో  ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది.

8 /8

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు, జ్యోతిష్య శాస్త్ర గమనం, గ్రహాల స్థితి గతుల ఆధారంగా పండితులు.. ఇతరత్రా ఆధారంగా  ఇవ్వబడింది.  ZEE NEWS దీనిని ధృవీకరించడం లేదు.