Add Zee Business As A Preferred Source
App

Guru Vakri 2025: గురువు వక్ర గమనంతో రాబోయే 120 రోజులు ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..

Written ByTA Kiran Kumar
Published: Sep 13, 2025, 04:22 PM IST|Updated: Sep 13, 2025, 04:22 PM IST

Guru Vakri 2025: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో ఏదైనా ఒక గ్రహ రాశి మార్పు మిగతా పన్నెండు రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అటు గ్రహాల తిరోగమనంతో పాటు ప్రత్యక్ష కదలిక కూడా శుభాశుభా ఫలితాలను అందిస్తూ ఉంటుంది. యేడాదికి  ఒకసారి తన రాశిని మార్చుకునే దేవ గురువు బృహస్పతి వక్ర గమనంలో  దాదాపు 120 రోజులు ఉండబోతున్నాడు. 

Guru Vakri 20251/6

గురు వక్రి 2025

Guru Vakri 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 2025 నవంబర్ 11న, బృహస్పతి చంద్రుని రాశి అయిన కర్కాటకంలో  తిరోగమనంలో ప్రయాణిస్తాడు. 2025 డిసెంబర్ 4న, మిథున రాశిలో అదే స్థితిలో కదులుతాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, బృహస్పతి ఈ స్థితిలో దాదాపు 120 రోజులు ఉండబోతున్నాడు. 

Mithuna Rasi 2/6

మిథున రాశి

మిథున రాశి.. మిథున రాశివారికి  బృహస్పతి తిరోగమనం వలన ఆర్థికంగా లాభాలను కలుగజేయనుంది.  మీ మాటలు సమాజంలో విలువ పెరుగుతాయి. మీ హోదా పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించనునున్నాయి. పనిలో కొత్త బాధ్యతలు పెరుగుతాయి.

Tula Rasi 3/6

తులా రాశి

తులా రాశి..  తుల రాశి వారికి బృహస్పతి తిరోగమనం గొప్పగా  ఉండబోతుంది. ఉపాధి పెరుగుదల ఉంటుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారంలో మీరు శుభ మలుపును చూస్తారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉండబోతుంది. 

Vrushabha Rasi 4/6

వృషభ రాశి

వృషభ రాశి.. వృషభ రాశి వారికి బృహస్పతి తిరోగమనం వలన అనేక ప్రయోజనాలు కలగబోతున్నాయి.   ఈ సమయంలో ఈ రాశి వారి ధైర్యం, ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతాయి. వీరి ఆధ్యాత్మక ప్రయాణం లాభదాయకంగా ఉండబోతుంది.  కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు అదృష్టం వరించనుంది. 

Kanya Rasi 5/6

కన్య రాశి

కన్య రాశి.. దేవ గురువు  బృహస్పతి వక్రగనమం వలన కన్య రాశి వారికి సానుకూల ఫలితాలను అందుకుంటారు. వీరి ఆదాయ వనరులు పెరుగుతాయి. భౌతికపరమైన  సౌకర్యాలు పెరుగుతాయి. కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరింత మెరుగుపడతాయి. నిపుణులైన ఉద్యోగులకు పదోన్నతి గ్యారంటీ కూడా.  

Disclaimer6/6

గమనిక

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, పండితులు ఇతరత్రా  సమాచారం ఆధారంగా ఇవ్వబడింది.  ZEE NEWS దీనిని బాధ్యత వహించదు.