Hanuman Jayanti 2025: వైశాఖ మాసంలో దశమిరోజున మనం హనుమాన్ జయంతిని జరుపుకుంటాం. అయితే.. ఈసారి హనుమాన్ జయంతి రోజున అరుదైనయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం పన్నెండు రాశులపై ఉంటుంది.
మనం ప్రతిసారి హనుమాన్ జయంతిని రెండు సార్లు జరుపుకుంటాం. దీనిలో ఒకటి చైత్ర పౌర్ణమి రోజున జరుపుకుంటే,మరోకటి వైశాఖమాసం దశమి రోజున హనుమాన్ జయంతి ఉత్సవాలను నిర్వహించుకుంటాం. అయితే.. ఈ సారి హనుమాన్ జయంతి గురువారం రోజు మే 22న వచ్చింది.
గురువు, శుక్రుడు ఒకే సరళ రేఖ మీదకు వస్తున్నాయి. హనుమంతుడు శివుడు అంశతో కేసరి, అంజనాదేవీలకు సంతానంగా పుట్టాడు. దీనితో పాటు హనుమాన్ జయంతికూడా ఉండటంతో.. కొన్ని రాశుల వారికి జీవితంలో కలలోకూడా అనుకొని విధంగా గొప్ప లాభం చేకూరుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఈ యోగం వల్ల.. మీనం రాశివారు.. విదేశాలకు వెళ్లే చాన్స్ లు వస్తాయి. ఇంట్లో ఆకస్మిక ధనలాభం కన్పిస్తుంది. కోర్టు కేసుల్లో విజయాల్ని సాధిస్తారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. రాదనుకున్న డబ్బులు సకాలంలో చేతికి అందుతాయి.
హనుమాన్ జయంతి వల్ల.. సింహారాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. జీవిత కాలంలో మీరు కోరుకున్న విజయాల్ని సాధిస్తారు. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు.
ఈ వృశ్చిక రాశి వారికి వివాహా జీవితం సాఫీగా సాగిపోతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయాల్లో రాణిస్తారు. మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలన్ని తొలగిపోయి ఆకస్మిక ధనలాభంను పొందుతారు. సంతానం పురోగతి ఉంటుంది.