Add Zee Business As A Preferred Source
App

Diwali Wishes 2025: ఆనందపు ప్రగతి కాంతులు వెల్లివిరియాలి.. దీపావళి శుభాకాంక్షలు చెప్పండి ఇలా

Published: Oct 20, 2025, 12:10 AM IST|Updated: Oct 20, 2025, 12:10 AM IST

Happy Diwali 2025 Telugu Wishes Share And Celebrate: చీకటిని పారదోలి వెలుగులు నింపే దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో చేసుకుంటాం. ఇంతటి గొప్ప పండుగను సురక్షితంగా.. సంతోషంగా బంధుమిత్రులు, కుటుంబసభ్యులతో చేసుకోవాలి. ఈ సందర్భంగా మీ ఆత్మీయులకు పండుగ శుభాకాంక్షలు ఇలా చెప్పండి.

1/6

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని చేసుకుంటాం. మీ జీవితంలో మరిన్ని విజయాలు దక్కాలని కోరుతూ దీపావళి శుభాకాంక్షలు.

2/6

అజ్ఞాన అంధకారాన్ని పారదోలి జ్ఞానపు కాంతులు ప్రసరింపచేసే తత్వాన్ని దీపావళి మనకు నేర్పుతుంది. దీపావళి మీ ఇంట సంతోషాలు నింపాలని కోరుతూ.. శుభాకాంక్షలు

3/6

మీ జీవితాల్లో ఆనందపు ప్రగతి కాంతులు వెల్లివిరియాలని.. సుఖ శాంతులు, సిరి సంపదలు నిండాలని ఆకాంక్షిస్తూ.. దీపావళి శుభాకాంక్షలు

4/6

మీ జీవితంలో ఆనందం, సిరిసంపదలు నిండిపోవుగాక. మీ అందరికీ సురక్షితమైన, సంతోషకరమైన, సంపన్నమైన దీపావళి శుభాకాంక్షలు

5/6

ప్రజల జీవితాల్లో చీకట్లన్నీ తొలగిపోయి జీవితంలో ఉన్నత అభివృద్ధి జ్యోతి వెలగాలని ఆశిస్తూ.. దీపావళి శుభాకాంక్షలు

6/6

ఈ దీపావళి మీ జీవితానికి అంతులేని ఆనందం, శాంతి, శ్రేయస్సు అందించాలి. మీ హృదయాన్ని ప్రేమతో నింపాలని.. రాబోయే సంతోషకరమైన రోజుల వైపు మిమ్మల్ని నడిపించాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు