Happy Teachers Day Wishes In Telugu: సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా టీచర్స్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆయన సమాజానికి చేసిన కృషికి గాను ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజున మీ ఉపాధ్యాయులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.
Happy Teachers Day Wishes: విద్యార్థులకు ఉపాధ్యాయులు విజ్ఞానం వివేకం, వ్యక్తిత్వ వికాసాన్ని అందించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తాడు. దీనికి గుర్తింపుగా భారతీయులు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయులను ఎంతో ఎంతో గౌరవించేవారు.. ఇలా గౌరవిస్తూ భారతదేశ రెండవ రాష్ట్రపతిగా, గొప్ప విద్యావేత్తగా నిలిచారు. దీంతో తన జన్మదినాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఏడాది ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన రోజున మీకు విద్యనిచ్చిన గురువులను తలుచుకుంటూ వారందరికీ ఇలా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి..
1/5మాకు అద్భుతమైన విద్యను అందించడమే కాదు.. జీవితంలో కష్టాలను సుఖాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిన మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు.. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు..
2/5మీ ఓర్పు, అంకితభావం, కష్టపడే తత్వం మాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి.. మీలాంటి గొప్ప ఉపాధ్యాయుడు మాకు దొరకడం జీవితంలో మేము చేసుకున్న పుణ్యం.. హ్యాపీ టీచర్స్ డే
3/5మీరు నాలో ఉన్న జ్ఞానాన్ని గుర్తించి.. నన్ను ఇంతటి గొప్పవాడిగా మలిచిన మీకు.. నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
4/5మీ అద్భుతమైన టీచింగ్ నా మనసులో ఎల్లప్పుడూ నిలిచిపోయి ఉంటుంది.. నా జీవితంలో ఇంతటి వెలుగును నింపిన మీకు.. హ్యాపీ టీచర్స్ డే..
5/5ప్రతి విద్యార్థికి మీలాంటి ఉపాధ్యాయుడు ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను.. ఈ అద్భుతమైన రోజున మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు...