Hardik Pandya Cars Collections: బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో సత్తాచాటుతూ టీమిండియాలో కీలక ప్లేయర్‌గా మారిపోయాడు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. ప్రస్తుతం ఆసియా కప్‌లో ఆల్ రౌండ్ షోతో భారత్ విజయాల్లో కీరోల్ ప్లే చేస్తున్నాడు. వ్యక్తిగత జీవితానికి వస్తే.. భార్య నటి నటాషా స్టాంకోవిచ్‌తో విడాకుల తరువాత మరో ఇద్దరితో డేటింగ్ చేసినట్లు రూమర్లు వచ్చాయి. ఇక పాండ్యా ఆస్తులు భారీగానే సంపాదించాడు.
1/8హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ ఏ గ్రేడ్ కాంట్రాక్ట్ ఉంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఐపీఎల్ నుంచి భారీగా సంపాదిస్తున్నాడు. అంతేకాకుండా యాడ్స్ ద్వారా కూడా ఆదాయం గట్టిగానే ఉంది. 2025 నాటికి పాండ్యా నికర ఆస్తుల విలువ రూ. 91-98 కోట్లు మధ్య ఉంటుందని అంచనా.
2/8BCCI గ్రేడ్ A సెంట్రల్ కాంట్రాక్టుతో పాండ్యాకు ఏడాది రూ.5 కోట్లు లభిస్తాయి. టెస్టులు, వన్డేలు, టీ20 లకు ఒక్కో మ్యాచ్ ఫీజులు అదనంగా ఉంటాయి.
3/8హార్దిక్ పాండ్యా కెరీర్‌ను మార్చేసింది ఐపీఎల్. ముంబై ఇండియన్స్ టీమ్‌కు కెప్టెన్‌గా పాండ్యాకు ఏడాదికి రూ. 16.35 కోట్లు సంపాదిస్తున్నాడు. ఐపీఎల్ ద్వారా అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఆటగాళ్లలో పాండ్యా ఒకరుగా ఉన్నాడు.
4/8స్పోర్ట్స్ గేర్, ఫ్యాషన్, కూల్ డ్రింక్స్, లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ అడ్వటైజ్‌మెంట్‌తో పాండ్యా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు. పాండ్యాతో బ్రాండింగ్ చేయించేందుకు కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి.
5/8పాండ్యాకు వడోదరలో ఒక విలాసవంతమైన పెంట్ హౌస్ ఉంది. అదేవిధంగా ముంబైలో ఒక ప్రీమియం అపార్ట్‌మెంట్ కూడా ఉంది. తన అన్న, స్టార్ క్రికెటర్ కృనాల్ పాండ్యాతో కలిసి ఉంటున్నాడు.
6/8ఈ స్టార్ ఆల్‌రౌండర్ వద్ద భారీ కార్ల కలక్షన్ ఉంది. రోల్స్ రాయిస్ నుంచి మెర్సిడెస్ AMG G63, పోర్స్చే కయెన్, రేంజ్ రోవర్ వరకు పాండ్యా వద్ద ఉన్నాయి.
7/8ఇక పాండ్యా స్టైలిష్‌కు పెట్టింది పేరు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తుంటాడు. స్టైలిష్ లైఫ్ స్టైల్, డిజైనర్ దుస్తులు, లగ్జరీ వాచెస్ ధరించడంలో పాండ్యా ఎప్పుడు ముందుంటాడు.
8/8నికర ఆస్తుల విలువలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టాప్‌లో ఉండగా.. పాండ్యా కూడా వేగంగా వారికి చేరువ అవుతున్నాడు. దాదాపు రూ. 100 కోట్ల నికర విలువతో తన ఆస్తులను మరింత పెంచుకుంటున్నాడు.