Add Zee Business As A Preferred Source
App

Hardik Pandya: హార్దిక్‌ పాండ్యా న్యూ లుక్‌.. ఆసియా కప్‌ ముందే ఫ్యాన్స్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్‌..!

Written ByRenuka Godugu
Published: Sep 05, 2025, 10:21 AM IST|Updated: Sep 05, 2025, 10:21 AM IST

Hardik Pandya New Look Viral: ఆసియా కప్ ముందే టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. కొత్త లుక్ తో ఫ్యాన్స్ ఫిదా చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫోటోలను షేర్ చేసి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నారు. ఆయన లుక్ ట్రెండీగా కనిపిస్తుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
 

Asia cup1/5

ఆసియా కప్‌

ఆసియా కప్‌కు హార్దిక్ పాండ్యా రెడీ అయిపోయారు. ఆయన కొత్త లుక్ తో అదరగొడుతున్నారు. అతని ట్రాన్స్ఫర్మేషన్ అదిరిపోయిందని నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. సెప్టెంబర్ 9న మొదలయ్యే ఈ టోర్నీ కోసం ఇప్పటికే పాండ్యా దుబాయ్ చేరుకున్నారు. హార్దిక్ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.   

All Rounder2/5

ఆల్ రౌండర్

ఇక స్టార్ ఆల్ రౌండర్ కొత్త లుక్ లో జుట్టును కత్తిరించుకొని దానికి ప్లాటినం రంగు వేసుకున్న ఫోటోలు సోషల్ మీడియా వేదికగా అందరిని ఆకట్టుకుంటున్నాయి. ప్రధానంగా శాండీ బ్లాండ్ కలర్ వేసి ఉంది.  

Instagram3/5

ఇంస్టాగ్రామ్

ఈ ఫోటోలను తానే ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసారు. హార్దిక్ పాండ్యా బ్యాట్‌తో మాత్రమే కాదు బంతితో కూడా జిమ్మిక్కులు చేయగల సత్తా ఉన్న ఆటగాడు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనున్న టోర్నమెంట్ షెడ్యూల్ విడుదల అయింది.   

Surya kumar yadav4/5

సూర్యకుమార్ యాదవ్

 ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు క్రికెట్‌ పోటీకి సిద్ధం అయిపోయింది. సెప్టెంబర్ 14న తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో కూడా భారత్ తలపడనుంది. ఇక 18న గ్రూప్ దశలో భారత్ చివరి మ్యాచ్లో ఒమన్ లో ఆడనుంది భారత్‌.   

Pandya5/5

పాండ్యా

 9 ఏళ్లుగా హార్దిక్ పాండ్యా క్రికెట్లో తనదైన సత్తా చూపిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌కు ప్రస్తుతం దూరంగా ఉన్నా టి20, వన్డే ఫార్మాట్లో రాణిస్తున్నారు. కొన్ని గణాంకాల ప్రకారం టీమ్ ఇండియాలో అత్యంత ముఖ్యమైన ఆటగాడు పాండ్యా..