Hair Fall Control : అమ్మాయిల్లో అబ్బాయిల్లో, ఇద్దరిలో కూడా ప్రస్తుతం జుట్టు ఊడిపోవడం అనేది సాధారణ సమస్యగా మారిపోయింది. ఒత్తిడి, విటమిన్ లోపం, హార్మోన్ల అసమతుల్యత, కెమికల్ ట్రీట్మెంట్స్.. లాంటి ఏమో ఒక కారణాలవల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో బట్టతల జీన్స్ ఉంటే మరింత జాగ్రత్త అవసరం. అలాంటి వాటికి అసలు పరిష్కారం ఉండదు అంటారు అందరూ. కానీ ఈ ఆహారాలు తింటే మాత్రం.. జీన్స్ లో బట్టతల ఉన్న కానీ రాకుండా నివారించవచ్చు.
1/5జుట్టు ప్రధానంగా కెరాటిన్ అనే ప్రోటీన్‌తో తయారవుతుంది. అందువల్ల ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం చాలా ముఖ్యం. గుడ్లు అధిక నాణ్యమైన ప్రోటీన్‌తో.. పాటు బయోటిన్ అనే విటమిన్‌ను కూడా అందిస్తాయి. బయోటిన్ లోపం వల్ల జుట్టు పలచబడి విరిగిపోతుంది. గుడ్లను నిత్యాహారంలో చేర్చడం ద్వారా జుట్టు బలంగా పెరుగుతుంది.
2/5ఐర లోపం వల్ల జుట్టు రాలిపోవడం ఎక్కువగా జరుగుతుంది, ముఖ్యంగా మహిళల్లో. పాలకూరలో ఇనుముతో పాటు విటమిన్ A, C, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ C శరీరంలో ఇనుము శోషణకు సహాయపడుతుంది. పాలకూర సలాడ్, స్మూతీ లేదా.. కూరల రూపంలో తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
3/5రోహు, బంగడా, సర్దీన్ వంటి చేపల్లో.. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి తల చర్మానికి హైడ్రేషన్ అందిస్తాయి. ఫలితంగా జుట్టు రాలిపోవడం తగ్గి, మెరిసే జుట్టు పెరుగుతుంది. వెజిటేరియన్లకు అవిసె గింజలు, చియా గింజలు.. తినడం మంచిది.
4/5బాదం, ఆక్రోటు, సన్ఫ్లవర్ గింజలు, పుంప్కిన్ సీడ్స్‌లో..విటమిన్ E, జింక్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. విటమిన్ E రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. జింక్, సెలీనియం జుట్టు రాలిపోవడాన్ని నివారిస్తాయి. రోజూ కొద్దిపాటి గింజలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు.
5/5చిలకడదుంపల్లో బీటా-కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ Aగా మారి తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వలన జుట్టు పొడిగా, బలహీనంగా మారకుండా రక్షిస్తుంది.