PM Modi at 75: నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 75వ యేట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్బంగా ఈయన ఖాతాలో కొన్ని రికార్డులు..
1/9PM Modi at 75: నరేంద్ర మోడీ అప్పటి ఉమ్మడి బాంబే స్టేట్ లో (ప్రస్తుత గుజరాత్) లోని వాద్ నగర్ లో 1950 సెప్టెంబర్ 17 న హీరా బెన్, దామోదర్ దాస్ ముల్ చంద్ మోడీలకు జన్మించారు. ఈయన 6 గురు సంతానంలో నరేంద్ర మోడీ 3వ వారు. ఆయన గుజరాత్ లోని వాద్ నగర్ లో ఛాయ్ అమ్ముతూ జీవనం సాగిస్తున్న తండ్రికి సాయం చేస్తూ చదువుకునేవారు. అలా టీ అమ్ముతూ ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) తో పరిచయం నమో జీవితాన్ని సమూలంగా మార్చేసింది.
2/9ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ ఫుల్ టైమ్ ప్రచారక్ బాధ్యతలు నిర్వహించారు.1971 బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో జైలు పాలయ్యారు. ఇందిరా గాంధీ విధించిన ఎమర్జన్సీ సమయంలో అజ్ఞాత జీవితం గడిపారు. ఆర్ఎస్ఎస్ ఫుల్ ప్రచారక్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే జన సంఘ్ లో చేరాు. 1980లో భారతీయ జనతా పార్టీలో క్రియా శీలకంగా వ్యవహరించారు.
3/9మన దేశంలో రాజస్థాన్ తర్వాత గుజరాత్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. 2001లో గుజరాత్ లోని భుజ్ భూకంప బాధితులను ఆదుకోవడంలో అప్పటి సీఎం కేశూభాయ్ పటేల్ విఫలం కావడంతో ఆయన ప్లేస్ లో నరేంద్ర మోదీని 7 అక్టోబర్ 2001లో అప్పటి బీజేపీ హై కమాండ్ ఆయన్ని సీఎం సింహాసనంపై కూర్చోబెట్టారు. అప్పటికీ ఆయన శాసనసభ్యుడు కాదు. ఎమ్మెల్యే కాకుండానే నేరుగా సీఎం అయ్యారు.
4/92002లో గుజరాత్ లోని గోద్రాలో ఓ రైలు కంపార్ట్ మెంట్ లో కర సేవలను కొంత మంది ముష్కరులు సజీవ దహనం చేయడంతో అల్లర్లు చెలరేగాయి. నరేంద్ర మోడీకి అప్పటికే బాధ్యతలు స్వీకరించి నెలలు మాత్రమే అయ్యాయి. అప్పటికే పరిస్థితులు పూర్తిగా ఆయన చేతుల్లోంచి వెళ్లిపోయాయి. .
5/9ఆ తర్వాత మోడీ తన చాణక్యంతో గుజరాత్ లో చెలరేగిన అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత వరుసగా 2002, 2007, 2012లో వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచారు. నాలుగు సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసారు.
6/92014లో లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రధాన మంత్రి అభ్యర్ధిగా బరిలో దిగి వారణాసితో పాటు వడోదర నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత వడోదరకు రాజీనామా చేసి వారణాసి ఎంపీగా కొనసాగారు.
7/92014, 2019, 2024లో వరుసగా మూడసార్లు ప్రధాన మంత్రి ఎన్నికయ్యారు. భారత దేశ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుస మూడు సార్లు ప్రమాణ స్వీకారం చేసిన నేతగా రికార్డులకు ఎక్కారు. మన దేశంలో జవహర్ లాల్ నెహ్రూ, నరేంద్ర మోడీ మధ్యలో ఇందిరా గాంధీ, అటల్ బిహారి వాజ్ పేయ్ మూడు సార్లు ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వాజ్ పేయ్ కేవలం 13 రోజులు.. 13నెలలు.. ఆ తర్వాత ఐదేళ్లు ప్రధానిగా కొనసాగారు.
8/9అప్పట్లో జవహర్ లాల్ నెహ్రూ ప్రజలు ఎన్నుకున్న ప్రైమ్ మినిష్టర్ కాకుండా.. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పోతూ పోతూ ఆయన్ని నియమిస్తూ వెళ్లింది. కానీ ఆ తర్వాత ప్రజల అభిమానంతో వరుసగా 1952, 1957,1962 ఎన్నికల్లో ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. అప్పట్లో కమ్యూనిష్టులు తప్ప ఎలాంటి ప్రతిపక్షం లేకుండా వరుసగా మూడుసార్లు ప్రైమ్ మినిష్టర్ అయ్యారు.
9/9కానీ నరేంద్ర మోడీ మాత్రం బలమైన ప్రతిపక్షాలను ఢీ కొని 2014,2019,2024 ఎన్నికల్లో విజయం సాధించి ప్రధాన మంత్రి పీఠం అధిరోహించారు. అంతేకాదు భారత దేశ ప్రధాన మంత్రిగా రష్యా, అమెరికా, సౌదీ అరేబియా సహా దాదాపు 26 దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్న ప్రపంచ నేతగా రికార్డు క్రియేట్ చేశారు.