Headache Relief Drink : చాలామంది విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. తలనొప్పి వస్తే చాలు ఏదో ఒక టాబ్లెట్ వేసుకునేద్దాం అని చూస్తూ ఉంటారు. ముఖ్యంగా మైగ్రేన్ ఉన్నవాళ్లకి తలనొప్పి ఎక్కువగా వస్తుంది. మీకు కూడా ఈ సమస్య ఉంటే ఇకమీదట టాబ్లెట్లు వేసుకునే అవసరం లేకుండా.. ఈ డ్రింక్ ట్రై చేయండి..
1/5చాలామందికి తరచుగా తలనొప్పి వస్తూ ఉంటుంది. పనిచేసి అలసిపోవడం వల్ల లేకపోతే ఆరోగ్యం బాగా లేకపోతేనో తలనొప్పి వస్తూ ఉంటుంది. అంతేకాదు.. మైగ్రేన్ ఉన్నవాళ్లకి తలనొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది.
2/5తలనొప్పి వచ్చిన ప్రతిసారి కూడా టాబ్లెట్ వేసుకోవడం అనేది అంత మంచిది కాదు. అందుకే దాని బదులు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ తాగితే కూడా.. కొద్ది నిమిషాల్లోనే తలనొప్పికి ఉపశమనం లభిస్తుంది.
3/5బాగా తరుగుకున్న అల్లం, చిటికెడు పసుపు, రెండు మిరియాలు, కొద్దిగా ధనియాలు, ఒక గ్లాస్ నీళ్లు.. కొద్దిగా నిమ్మరసం.
4/5ముందుగా గ్లాసు నీళ్లు స్టవ్ పైన పెట్టుకొని.. అందులో బాగా తరుగుకున్న అల్లం, చిటికెడు పసుపు,రెండు మిరియాలు, కొద్దిగా ధనియాలు.. వేసి బాగా కాగనివ్వాలి.
5/5ఇప్పుడు దాన్ని ఫిల్టర్ చేసుకొని గ్లాస్ లో పోసుకోవాలి.. అందులో కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. ఈ రసం తలనొప్పి వచ్చినప్పుడు తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది.