Add Zee Business As A Preferred Source
App

Healthy Juice: ఇది పండు మాత్రమే కాదు.. అమృతం.. ఎన్నో రోగాలకు పరిష్కారం దీంతోనే..!

Written ByVishnupriyaUpdated byVishnupriya
Published: Aug 16, 2025, 08:40 PM IST|Updated: Aug 16, 2025, 08:40 PM IST

Juice for Heart Health 
సాధారణంగా నిమ్మ జాతికి సంబంధించిన పండ్లు విటమిన్ సి అధికంగా అందిస్తాయి. అయితే విటమిన్ సి కాకుండా ఎన్నో అవసరాలు అందించే పండు మొసంబి.
మొసంబి పండు గురించి మన అందరికీ తెలిసిందే. నిమ్మ జాతికి సంబంధించిన ఈ పండు ఎన్నో అనారోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది. 
 

Mosambi Juice 1/7

మొసంబి తియ్యగా ఉండడమే కాకుండా..ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైన పండుగా కూడా నిలుస్తుంది.  ప్రతిరోజూ ఒక గ్లాసు మొసంబి జ్యూస్ తాగడం.. వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.

Raises Immunity 2/7

మొసంబి జ్యూస్ లో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కేవలం శీతాకాలంలోనే కాకుండా, వర్షాకాలంలో కూడా మొసంబి తినడం ఆరోగ్యానికి మంచిది.

Reduces Digestion Issues3/7

ప్రతిరోజూ మొసంబి జ్యూస్ తీసుకుంటే జీర్ణం సమస్యలు, అజీర్తి, కడుపు నొప్పులు.. తగ్గిస్తాయి. దీనితో పాటు.. శరీరంలోని విషాలను బయటకు తీయడంలో కూడా సహాయపడుతుంది.

Protects Heart Health 4/7

మొసంబిలోని యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. అలాగే..ఇది గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది.

Skin Health Benefits 5/7

మొసంబి జ్యూస్ లోని విటమిన్ C మరియు యాంటీఆక్సిడెంట్లు చర్మం మీద మంచి ప్రభావం చూపిస్తాయి. ఇది వయసు పెరుగుదల కారణంగా వచ్చే నలుపు..మచ్చల్ని తగ్గిస్తుంది. చర్మాన్ని అందంగా ఉంచుతుంది.  

BP Control 6/7

మొసంబి లో ఉన్న పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది హైపర్టెన్షన్ రిస్కును తగ్గిస్తుంది.

​Reduces Health Issues 7/7

మొసంబి జ్యూస్ తాగడం వలన జలుబు, వాంతులు, క్రాంపులు వంటి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.