Vitamins Deficiency: తరచూ దుఖం, ఆందోళన వెంటాడుతున్నాయా, ఈ విటమిన్ల లోపం కావచ్చు

మనిషి సంపూర్ణ ఆరోగ్యం అనేది వివిధ రకాల విటమిన్లు, పోషకాలపై ఆధారపడి ఉంటుంది. విటమిన్ల లోపం ఉంటే మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఒకవేళ మీలో ఎవరికైనా మానసిక ఆరోగ్యం సరిగ్గా లేక నిరంతరం దుఖంగా ఉంటుంటే విటమిన్ డి, విటమిన్ బి12 , ఫోలిక్ యాసిడ్ లోపం కావచ్చు. 

Vitamins Deficiency: మనిషి సంపూర్ణ ఆరోగ్యం అనేది వివిధ రకాల విటమిన్లు, పోషకాలపై ఆధారపడి ఉంటుంది. విటమిన్ల లోపం ఉంటే మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఒకవేళ మీలో ఎవరికైనా మానసిక ఆరోగ్యం సరిగ్గా లేక నిరంతరం దుఖంగా ఉంటుంటే విటమిన్ డి, విటమిన్ బి12 , ఫోలిక్ యాసిడ్ లోపం కావచ్చు. 
 

1 /6

డిప్రెషన్ ఫోలిక్ యాసిడ్ లోపంతో డిప్రెషన్ సమస్య తలెత్తవచ్చు. ఎందుకంటే ఇది సెరిటోనిన్ వంటి న్యూరో ట్రాన్స్‌మిట్టర్లపై ప్రభావం చూపిస్తుంది. మూడ్ నియంత్రించేది ఇదే. 

2 /6

ఫోలిక్ యాసిడ్ ఫోలిక్ యాసిడ్ కూడా మానసిక ఆరోగ్యంపై ప్రతికూల లేదా సానుకూల ప్రభావం చూపిస్తుంది. ప్రత్యేకించి గర్భిణీ మహిళలు, శిశువుకు చాలా అవసరం

3 /6

మూడ్ స్వింగ్-డిప్రెషన్ విటమిన్ బి 12 లోపంతో మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుంది. విసుగు, కోపం, ఉదాసీనత వంటి మూడ్ ఆఫ్ లక్షణాలు కన్పిస్తాయి. విటమిన్ బి12 లోపం వల్ల డిప్రెషన్‌కు గురవుతారు. ఎందుకంటే ఇది సెరిటోనిన్, డోపమైన్ వంటి హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది. 

4 /6

విటమిన్ బి12 లోపం విటమిన్ బి12 శరీరంలో ఎప్పుడూ తగిన మోతాదులో ఉండాలి. లేకపోతే నాడీ వ్యవస్థ, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.

5 /6

ఒత్తిడి విటమిన డి లోపముంటే శరీరంలో సెరిటోనిన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దాంతో డిప్రెషన్, ఉదాసీనత వెంటాడుతాయి. అంతేకాకుండా ఆందోళన, అలసట, బలహీనత ఎక్కువగా ఉంటాయి

6 /6

విటమిన్ డి లోపం శరీరానికి విటమిన్ డి అనేది చాలా ముఖ్యమైంది. ఇది ఎముకల పటిష్టత, ఇమ్యూనిటీకి చాలా అవసరం. మానసిక ఆరోగ్యం కూడా వీటి వల్ల ప్రభావితమౌతుంది