Add Zee Business As A Preferred Source
App

Palak Millet Pongal: ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాలక్ పొంగలి.. ఎలా చేయాలంటే..?

Written ByVishnupriya
Published: Sep 08, 2025, 01:20 PM IST|Updated: Sep 08, 2025, 01:20 PM IST

Palak Pongal Recipe : ఆరోగ్యానికి పాలకూర ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి.. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వాళ్ళకి.. పాలకూర తినడం ఎంతో మంచిది. మరి అలాంటి పాలకూరతో ఎంతో ఆరోగ్యకరమైన పాలకూర పొంగలి ఎలా చేసుకోవాలంటే..

Palak Pongal Preparation1/5

పాలక్ పొంగలి

వారానికి కనీసం రెండు రోజులు టిఫిన్ గా పాలకూర పొంగలే తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. పాలకూర పెద్దవాళ్లకే కాకుండా చిన్న పిల్లలకు కూడా ఎంతో మంచిది. 

Required Ingredients 2/5

కావలసిన పదార్థాలు

మిల్లెట్ : రెండు కప్పులు  పెసలపప్పు: ఒక కప్పు  పాలకూర: ఒక కప్పు  అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా  మిరియాలు - ఆరు నుంచి ఏరు రుచికి తగినంత ఉప్పు.

Palakura Pongal 3/5

పాలక్ పొంగలి

ముందుగా రెండు గ్లాసుల మిల్లెట్ అలానే పెసల పప్పు రాత్రంతా నానబెట్టుకోవాలి. మరోపక్క పాలకూర కొద్దిగా వేయించుకొని.. మిక్సీలో పాలకూర, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టాలి.   

Tasty Palakura Pongal 4/5

పాలక్ పొంగలి

ఇప్పుడు ఒక కుక్కర్లో నూనె పోసుకుని.. అందులో మిరియాలు వేయించుకొని.‌.. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో పాలకూర పేస్ట్ వేసుకోవాలి.

Tasty Palakura Pongal Recipe 5/5

పాలక్ పొంగలి

అది కొంచెం బాగా ఉడికిన తర్వాత నానబెట్టుకున్న మిల్లెట్, పెసలపప్పు వేసుకొని.. నీళ్లు పోసి పెట్టి నాలుగు విజిల్స్ రానివ్వాలి. ఆ తరువాత పైన నెయ్యి వేసుకుంటే సరిపోతుంది.