Weather Updates In Ap: ఏపీని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.
1/5ఆంధ్రప్రదేశ్ రాష్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో.. ప్రజలు అల్లాడిపోతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో.. వర్షాలు దంచికొడుతున్నాయి.
2/5అయితే రానున్న మూడు గంటల్లో ఏపీలో భారీగా వర్షాలు పడతాయని.. విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. అంతేకాకుండా పలు జిల్లాలో పిడుగులు కూడా పడతాయన్నారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్ల క్రింద ఉండకూడదని, ఇంట్లోనే సురక్షితంగా ఉండండని ప్రజలకు సూచించారు.
3/5ఈ క్రమంలో విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
4/5శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, నెల్లూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు.
5/5పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 9 వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.