Heavy Rains: భారీ వర్షాలు.. బయటకు రాకండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి: పోలీసులు..

Heavy Rains Precautions: తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాహనాలు కొట్టుకుపోవడంతో పాటు అన్నదాతలకు కూడా దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. సాయంత్రం అయిందంటే చాలు వర్ష బీభత్సం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. 
 

1 /7

 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. పిడుగు పడడంతో నిన్న నలుగురు మృతి చెందారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాల వేళ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.   

2 /7

వర్షాలు పడుతున్న సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. కేవలం సురక్షితమైన ప్రాంతాల్లో మాత్రమే ఉండండి. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుంది.  

3 /7

 అంతేకాదు ప్రధానంగా మెరుపులు పడుతున్న సమయంలో ఇనుప తీగలకు దూరంగా ఉండాలి. బట్టలు తీయడానికి పై అంతస్థుకు వెళ్లే వారు మరింత జాగ్రత్త. ఇనుముకు సంబంధించిన వస్తువులను తాకకుండా జాగ్రత్త వహించండి. ఎందుకంటే విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంది తద్వారా ప్రాణాలు కోల్పోతారు.   

4 /7

ఇలా భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో విరుచుకుపడినప్పుడు ఎలక్ట్రికల్ పరికరాలను కూడా దూరంగా ఉండాలి. వాటికి ఉండే ప్లగ్లను తొలగించండి. విద్యుత్ షాక్ నివారించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇలాంటి జాగ్రత్త చర్యలు ముందుగానే తీసుకోవాలి.   

5 /7

ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు ఎత్తయిన వస్తువుల సమీపంలో ఉండకూడదు. ఇక డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త పహించాలి. అవసరమైనప్పుడు మాత్రమే బయటకి రావాలి. లేకపోతే ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నారు.   

6 /7

ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు ముందుగానే తెలుసుకోవచ్చు. ఎమర్జెన్సీ కిట్‌ కూడా అందుబాటులో ఉంచుకోండి. అదనంగా నీరు, ఫ్లాష్ లైట్, ఫస్ట్ ఎయిడ్ పెట్టుకోండి. గొడుగు, రెయిన్‌ కోట్‌ లేనిదే బయటికి రాకూడదు. వాటర్ ప్రూఫ్ స్లిప్పర్స్ మాత్రమే ఉపయోగించండి.   

7 /7

 ప్రధానంగా వరదలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రయాణాలు మానుకోండి. లోతుగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణం చేయకూడదు. ఇది ప్రాణాంతకం ఇక కరెంటు తీగలు విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండండి. వర్షాలు పడ్డప్పుడు కిటికీ దగ్గర కూడా ఉండకూడదు. డోర్లు మూసి ఉంచాలి ఇక మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా నీటి నిల్వకు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.