Add Zee Business As A Preferred Source
App

Rain Alert: ఏపీలో దంచికొడుతున్న వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్.. బయటకు రావొద్దంటూ వాతావరణ శాఖ హెచ్చరిక

Written ByAruna Maharaju
Published: Oct 05, 2025, 11:59 AM IST|Updated: Oct 05, 2025, 11:59 AM IST

Heavy Rains Alert: ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే, రాబోయే మూడు, నాలుగు రోజుల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు రావొద్దని సూచించింది.

Heavy Rains In Ap1/5

ఏపీలో భారీ వర్షాలు

తమిళనాడు తీరం వెంట బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.   

Rains In Ap2/5

ఏపీలో భారీ వర్షాలు

కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. గంటకు 50 నుంచి 60 కిలో మీటర్లు వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, అవసరం అయితే తప్ప ప్రజలకు బయటకు రావొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.   

Rains 3/5

ఏపీలో భారీ వర్షాలు

విజయనగరం, విశాఖపట్టణం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతోపాటు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అల్లూరిసీతారామరాజు జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది.

Heavy Rains In Ap4/5

ఏపీలో భారీ వర్షాలు

వాయుగుండం ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తుండగా.. ఆ వరద పోటెత్తి శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహకంలోని 60కిపైగా గ్రామాలు ముంపుబారిన పడ్డాయి. శ్రీకాకుళం నగరంతోపాటు పలు ఊళ్లు ఇంకా జలదిగ్భందంలోనే ఉన్నాయి. 

Heavy Rains Alert5/5

ఏపీలో భారీ వర్షాలు

దాదాపు 8వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. పాత పట్నం, అమదాలవలస నియోజకవర్గాల్లో పంటనష్టం ఎక్కువగా ఉంది. వంశధార కరకట్టలు బహీనంగా ఉండడంతో పలు చోట్ల కోతకు గురయ్యాయి. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.