Hyderabad Rain Update: తెలంగాణ రాజధాని హైదరాబాద్ ను వర్షాలు వీడటం లేదు. గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి వర్షం హెచ్చరికలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
1/5Hyderabad Rain Update: రాజధాని హైదరాబాద్ తో పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నిన్న రాత్రి హైదరాబాద్ లో కురిసిన వర్షంతో ఆగం ఆగమైంది.
2/5మరోవైపు తెలంగాణలో మరో రెండు రోజులు పాటు ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.ముఖ్యంగా నేడు సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది.
3/5గంటకు 30- 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇక శనివారం రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయి.
4/5హైదరాబాద్ లో రాత్రి కుండపోత వాన కురిసింది. దీంతో పలు కాలనీల్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరిస్థితి అస్థవ్యస్తంగా మారింది. భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రవాహంతో పలు చోట్ల ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. అమీర్‌పేట్‌లోని గాయత్రి నగర్‌లో ఇళ్లలోకి వరద నీరు చేరింది.
5/5సీతాఫల్ మండిలో ప్రహారీ గోడ కూలింది. రామ్‌గోపాల్ పేట్‌లోని బస్తీలు, చిల్కలగూడ, వారాసిగూడ, మెట్టుగూడ, ఈస్ట్ మారేడ్‌పల్లి అంబేద్కర్ నగర్, మియాపూర్ దీప్తిశ్రీ నగర్‌లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఒలిఫెంట రైల్వే వంతెన కింద భారీ వరద నీరు చేరడంతో సికింద్రాబాద్-తార్నాక, ముషీరాబాద్ వైపు వెళ్లే రహదారులను పోలీసులు నిలిపివేశారు. ఇక ముషీరాబాద్‌లో అత్యధికంగా 18.43 సెం.మీ వర్షపాతం నమోదైంది.